యంగ్ టైగర్ జూనియర్ఎన్టీఆర్ ( Young Tiger Jr.NTR )నటించిన దేవర సినిమాకు సంబంధించి ఇండోర్ లో ఈవెంట్ నిర్వహించాలని భావించగా భారీ సంఖ్యలో అభిమానులు గుమికూడటంతో ఈవెంట్ క్యాన్సిల్ చేశారు.ఒకవేళ ఆరోజు ఈవెంట్ జరిగి ఉంటే అభిమానులకు గాయాలు అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది.ఎన్టీఆర్ దేవర సినిమా ప్రదర్శించిన థియేటర్లకు సైతం వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం.
దేవర సినిమాకు బెనిఫిట్ షోలు ప్రదర్శితం అయినా అర్ధరాత్రి సమయంలో షోలు ప్రదర్శించడం వల్ల ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు.అయితే పుష్ప సినిమా విషయంలో మాత్రం విభిన్నంగా జరిగింది.
పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించి సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన వల్ల రేవతి( Revathi ) అనే మహిళ మృతి చెందారు.రేవతి కొడుకు శ్రీతేజ్ కోలుకోవడానికి కూడా చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

పుష్ప ది రూల్ సినిమా( Pushpa the rule movie ) కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.మరోవైపు పుష్ప మేకర్స్ అభిమానులకు శుభవార్త చెప్పారు.పుష్ప ది రూల్ మూవీ త్రీడీ వెర్షన్ ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు.త్రీడీ వెర్షన్ వల్ల పుష్ప ది రూల్ సినిమాకు కలెక్షన్లు పెరుగుతాయేమో చూడాల్సి ఉంది.

పుష్ప ది రూల్ మూవీ సక్సెస్ రష్మిక, శ్రీలీలలకు ఎంతమేర ప్లస్ అవుతుందో చూడాల్సి ఉంది.పుష్ప ది రూల్ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.ఈ వారం కూడా పుష్ప ది రూల్ కలెక్షన్ల పరంగా సంచలనాలను కొనసాగించే ఛాన్స్ ఉంటుంది.పుష్ప ది రూల్ సినిమాకు యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి.
అల్లు అర్జున్ భవిష్యత్తులో వివాదాలు రాకుండా ఏ విధంగా ముందుకెళ్తారో చూడాల్సి ఉంది.