సంధ్య థియేటర్ ( Sandhya theter )తొక్కిసలాట ఘటన ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ ఘటన వల్ల స్టార్ హీరో అల్లు అర్జున్ జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది.
ప్రస్తుతం అల్లు అర్జున్ బెయిల్ పై బయటకు వచ్చారు.బన్నీని చూడటానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ సెలబ్రిటీలు వచ్చారు.
దర్శకులు, నిర్మాతలు బన్నీ ఇంటికి రాగా కొందరు హీరోలు బన్నీకి ఫోన్ చేసి మాట్లాడారు.
అయితే బన్నీ( Bunny ) ఇంటికి వెళ్లిన సెలబ్రిటీలు ఆ మహిళ ఇంటికి వెళ్లగలరా అనే ప్రశ్న సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.
నెటిజన్ల సూటి ప్రశ్న ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.రేవతి మృతి చెందిన నేపథ్యంలో ఆమె కుటుంబానికి ఎంతమంది సెలబ్రిటీలు వెళ్లారు అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
నెటిజన్ల సూటి ప్రశ్నలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.
టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ కామెంట్లపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.పుష్ప సినిమాపై ప్రముఖ రాజకీయ నాయకులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.మరోవైపు బన్నీ చిరంజీవితో భేటీ కాగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
రాబోయే రోజుల్లో బన్నీ పవన్ కళ్యాణ్ ను సైతం మీట్ అవుతారేమో చూడాల్సి ఉంది.
అల్లు అర్జున్ కు మెగా ఫ్యామిలీ అండగా నిలబడటంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.అల్లు అర్జున్ సినిమాలేవీ వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ 2026 సంవత్సరంలో థియేటర్లలో విడుదలయ్యే అవకాశం అయితే ఉంది.
త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.స్టార్ హీరో అల్లు అర్జున్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.