దేవతలకు ఇష్టమైన కదంబ మొక్క విశిష్టత ఏమిటో తెలుసా?

మన సంస్కృతి సంప్రదాయాలలో ఎన్నో మొక్కలకు ఎంతో ప్రత్యేకత ఉంది.అలాంటి ప్రత్యేకత కలిగిన మొక్కలలో కదంబ ఒకటి.

 Benefits Of Kadamba Vruksham Kadamba Vruksham, Kabanda Benefits, Gods, Maha Bhar-TeluguStop.com

ఈ కదంబ మొక్కనే రుద్రాక్షాంబ అని కూడా పిలుస్తారు.భారతదేశంలోని దక్షిణాదిలో జగజ్జనని అమ్మవారిని కదంబవాసి అని అంటూ పూజలు చేస్తారు.

అదేవిధంగా హనుమంతుడు పుట్టుకకు కారణం కూడా ఈ మొక్క అని పురాణాలు చెబుతున్నాయి.అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికల చీరలను దొంగలించి దాచింది కూడా ఈ వృక్షం లోనే ఈ చెట్టు నుంచి వెలువడే పరిమళాలను ఆస్వాదిస్తూ చెట్టు నీడలోనే రాధాకృష్ణల ప్రేమాయణం కూడా జరిగింది.

అందుకే ఈ మొక్కకు ఎంతో విశిష్టత కల్పించారు.

ఎంతో పవిత్రమైన ఈ కదంబ వృక్షం గురించి భగవద్గీత, మహాభారతంలో కూడా ప్రస్తావించారు.

కదంబ వృక్షం చూడటానికి ఎంతో పెద్దగా ఉండి ఈ పూలు గుండ్రని ఆకారంలో కలిగి ఉంటాయి.ఈ పుష్పాలను ఎక్కువగా లలితాదేవి పూజలో ఉపయోగిస్తారు.

అదేవిధంగా ఈ వృక్షాన్ని ఉపయోగించి వివిధ రకాల బొమ్మలను తయారు చేస్తారు.అన్ని రకాల వృక్షాలు మాదిరిగా ఈ చెట్టు ఆకులు రాలవు ఎల్లప్పుడూ పచ్చగానే కనిపిస్తుంది.

Telugu Gods, Maha Bharatham-Telugu Bhakthi

పురాణాల ప్రకారం ఈ కదంబ వృక్షానికి రెండు పేర్లు ఉన్నాయి.ఉత్తరభారతంలో దీన్ని కృష్ణవృక్షమనీ, దక్షిణభారతంలో పార్వతీవృక్షమనీ అంటారు.శ్రీకృష్ణుడు రాధతో తన ప్రేమ ప్రయాణాన్ని కొనసాగించింది ఈ చెట్టు కిందనే కనుక కృష్ణుడికి ఈ వృక్షానికి అవినాభావ సంబంధం ఉంది.అందుకే ఉత్తరభారతంలో వృక్షాన్ని కృష్ణ వృక్షం అని పిలుస్తారు.

అదేవిధంగా దక్షిణ భారతంలో అమ్మవారిని కదంబవాసిగా పూజిస్తారు.అదే విధంగా అమ్మవారి పూజల కు కదంబ పుష్పాలు ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి.

గ్రహ దోషాలు ఉన్న వారు అమ్మవారికి ఈ పుష్పాలతో పూజ చేయటం వల్ల దోష పరిహారం జరుగుతుందని భావిస్తారు.ప్రస్తుతం మధుర మీనాక్షి అమ్మవారు కొలువై ఉన్న ఈ ప్రాంతాన్ని కందబవనం అని పిలుస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube