వేదాలను పరిరక్షించడానికి వెలసిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి( Sri Venkateswara Swamy ) అని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి వెల్లడించారు.ప్రపంచంలో నిరంతరం చతుర్వేద పారాయణం జరిగే దివ్యక్షేత్రం తిరుమల మాత్రమేనని పారాయణదారుల పోస్టుల ద్వారా వేద పండితులను పోషిస్తున్న సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే అని ఆయన చెప్పారు.
చెన్నై టీ నగర్ లో టీటీడీ నిర్మించిన పద్మావతి అమ్మవారి దేవాలయ మహా కుంభాభిషేకం శాస్త్రోక్తంగా సాగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వరూపానందేంద్ర స్వామి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.
తిరుచానూరు పద్మావతి అమ్మవారు చెన్నైవాసులను ఆశీర్వదించడానికి టీ నగర్ లో కొలువు తిరారని తెలిపారు.
ఏపీ సీఎం జగన్( AP CM Jagan ), టిటిడి చైర్మన్ వై వి.సుబ్బారెడ్డి, చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శేఖర్ రెడ్డి ( Shekhar Reddy )కృపతో అమ్మవారి దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించారని ప్రశంసించారు.దేవాలయ నిర్మాణానికి స్థలం విరాళంగా ఇచ్చిన సినీ నటి కాంచన, వారి కుటుంబ సభ్యులకు వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి అమ్మవారు ఆశీస్సులు ఉంటాయని వెల్లడించారు.
వెంకటేశ్వర స్వామిని తమిళులంతా తమ సొంతదైవంగా భావిస్తారని, తమిళనాడులోని వెంకన్న భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారని వెల్లడించారు.అయితే దేశంలో జ్యోతిర్లింగాలు అష్టదశ శక్తి పీఠాలను దర్శించలేని భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం ద్వారా మోక్షం లభిస్తుందని ఆయన వెల్లడించారు.
టీటీడీ బోర్డు సభ్యులు, డాక్టర్ శంకర్, టిటిడి ఢిల్లీ స్థానిక సలహా మండలి ఛైర్ పర్సన్ వేమిరెడ్డి, ప్రశాంతి, జేఈవో వీరబ్రహ్మం, అగమ సలహాదారు శ్రీనివాసచార్యులు, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ్ కుమార్ తదితరులు ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.
DEVOTIONAL