Prostrating women :ఆడవారు సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..

సాధారణంగా మన దేశ వ్యాప్తంగా చాలా ఆలయాలలో భగవంతుని ముందు సాష్టాంగ నమస్కారం చాలామంది భక్తులు చేస్తూ ఉంటారు.అయితే ఈ సాష్టాంగ నమస్కారం దేవతలు, ఋషులు,పెద్దలు మొదలైన వారు నమస్కారానికి ఉత్తమమైన మార్గం అని చెబుతూ ఉంటారు.

 Do You Know The Benefits Of Prostrating Women, Women, Devotional , Prostrating,-TeluguStop.com

అయితే ఈ సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల శరీరక, మానసిక సామర్థ్యం కూడా పెరిగే అవకాశం ఉంది.సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలి.

దాని అర్థం ఏమిటి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటిగా ముఖ్యంగా సాష్టాంగ నమస్కారం అంటే మన శరీరంలోని ఎనిమిది భాగాలను ఉపయోగించి నమస్కారం చేయడం అని అర్థం.

ఈ సాష్టాంగ నమస్కారం చేయడం కోసం మన శరీరంలో రెండు కాళ్లు రెండు, మోకాళ్లు, రెండు అరచేతులు, చాతి, నుదురు వీటన్నింటినీ ఉపయోగించాల్సి ఉంటుంది.అయితే భక్తి పూర్వకంగా నమస్కరించడం ద్వారా భగవంతునికి సంపూర్ణ శరణాగతి తెలియజేయడం అని కూడా అర్థం వస్తుంది.

ఇక్కడ మన అహాన్ని పక్కన పెట్టి లొంగిపోవాలని చాలామంది వేద పండితులు చెబుతూ ఉంటారు.

Telugu Devotional, Lord, Capacity, Pooja, Temple-Latest News - Telugu

ఈ సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల అహంకారం కూడా తగ్గిపోతుంది.ఆడవారు సాష్టాంగ నమస్కారం చేయవచ్చా లేదా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.మన పురాణాల ప్రకారం ఆడవారు సాష్టాంగం నమస్కారంలో కొన్ని నియమాలు ఉన్నాయి.

ఎందుకంటే వారి ఛాతి ప్రాంతం, పొట్ట, తుంటి నేలను తాకకూడదు.ఆడవారికి పంచాంగ నమస్కారం చేయాలని నియమం ఉంది.

ఎందుకంటే ఆడవారు తన బిడ్డకు పాలిచ్చి తన కడుపులోని బిడ్డను తొమ్మిది నెలల పాటు కాపాడుతారు.ఇంకో విషయం ఏమిటంటే ఆడవారు రుతుక్రమం కాగానే పూర్వం పెళ్లి చేసుకునేవారు పెళ్లి జరిగినప్పటి నుంచి ఏటా ప్రతి సంవత్సరం పిల్లలు కూడా పుట్టేవారు.

దీని కారణంగా ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం ఎప్పుడు బాలింతగా పాలిచ్చేవారు.ఈ సమయంలో సాష్టాంగ నమస్కారం చేయడం కష్టమని హేతుమధ్యమైన కారణం కూడా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube