ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.05
సూర్యాస్తమయం: సాయంత్రం.6.20
రాహుకాలం: సా.4.30 ల6.00
అమృత ఘడియలు: మ.2.11 ల3.20
దుర్ముహూర్తం: సా.4.25 ల5.13
మేషం:
ఈరోజు అనారోగ్య సమస్యల విషయంలో అశ్రద్ధ పనిచేయదు.దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.కొన్ని పనులు వ్యయప్రయాసలతో గాని పూర్తి కావు.బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి.వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.ఉద్యోగ వాతావరణం నిరాశ కలిగిస్తుంది.
వృషభం:
ఈరోజు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు.గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.ఆలయ దర్శనాలు చేసుకుంటారు.సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.వ్యాపారాలు అనుకూలిస్తాయి.ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
మిథునం:
ఈరోజు విద్యార్థులకు ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి.ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.చేపట్టిన పనులలో ఆకస్మిక విజయం సాధిస్తారు.ప్రతికూల పరిస్థితుల నుండి తెలివిగా బయట పడతారు.వ్యాపారాలు పుంజుకుంటాయి.ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.
కర్కాటకం:
ఈరోజు కొన్ని వ్యవహారాలు శ్రమతో పూర్తి చేస్తారు.బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి.అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.చేపట్టిన పనులు మధ్యలో వాయిదా పడతాయి.కుటుంబంలో ఊహించని వివాదాలు కలుగుతాయి.వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.
సింహం:
ఈరోజు ముఖ్యమైన పనులలో శ్రమకు ఫలితం ఉండదు.ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.సన్నిహితులతో కలహా సూచనలు ఉన్నవి.
కొత్త రుణయత్నాలు వేగవంతం చేస్తారు.ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.
కన్య:
ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు.గృహమునకు కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.వ్యాపార పరంగా అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు.ఉద్యోగ అనుకూలత కలుగుతుంది.
తుల:
ఈరోజు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆలయ దర్శనాలు చేసుకుంటారు.ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి కలుగుతుంది.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
వృశ్చికం:
ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్న.నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది.ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది.అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు పెరుగుతాయి.
ధనుస్సు:
ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల మవుతాయి.ఉద్యోగులు అధికారుల సహాయ సహకారాలు పొందుతారు.వ్యాపారస్తులకు అవసరానికి ధన సహాయం లభిస్తుంది.బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.మిత్రుల నుంచి ఆకస్మిక ధన లబ్ది పొందుతారు.
మకరం:
ఈరోజు అనుకోని ప్రయాణాలు వస్తాయి.రుణదాతల నుండి ఒత్తిడులు పెరుగుతాయి.దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది.కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది.
ఆలోచనలు స్థిరంగా ఉండవు.ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
కుంభం:
ఈరోజు ఆర్థికాభివృద్ధి కలుగుతుంది.దూరపు బంధువుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు.ప్రముఖుల సలహాలు కొన్ని వ్యవహారాలలో పనిచేస్తాయి.మంచి మాట తీరుతో ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.
మీనం:
ఈరోజు దూరప్రయాణాలలో శ్రమ మరింత అధికమవుతుంది.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.నిరుద్యోగులకు కష్టానికి తగిన ఫలితం ఉండదు.వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు.