Home Vastu : ఈ రంగాల చెందిన వారు.. దక్షిణం వైపు ఉన్న ఇంట్లో ఉండవచ్చా..?

ఇంటి నిర్మాణ విషయంలో చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు.వాస్తు శాస్త్రాన్ని( Vastu Shastra ) బట్టి ఏది ఏ వైపు ఉండాలనీ చూసి మరి ఇల్లు నిర్మించుకుంటూ ఉంటారు.

 Those Who Belong To These Sectors Can Stay In The South Side House-TeluguStop.com

వాస్తు దోషం ఉంటే ఎంత మంచి ఇల్లు కట్టుకున్న సంతోషం అనేదే ఉండదని పండితులు చెబుతున్నారు.అయితే చాలా మందికి ఉండే అనుమానం ఏమిటంటే, ఇంటి నిర్మాణం దక్షిణం వైపు( South Side ) ఉంటే మంచిదా? కాదా అని ఆలోచిస్తూ ఉంటారు.అసలు వాస్తు శాస్త్రం ఏమి చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.ఇల్లు దక్షిణం వైపు నిర్మిస్తే సూర్యకిరణాలు పడవని, అది అశుభమని దీని వల్ల ఇల్లు చీకటిగా అసలు నివసించడానికి వీలు లేకుండా ఉంటుందని చాలా మంది ప్రజలు భావిస్తారు.

Telugu Vastu, Kuja Graha, Temple, Vastu Shastra, Vastu Tips-Latest News - Telugu

దీని వల్ల వ్యక్తిగత, ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయని నమ్ముతారు.జ్యోతిష్య శాస్త్రం కూడా ఇదే చెబుతూ ఉంది.దక్షిణం వైపు కట్టించిన ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక, వైవాహిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.అయితే దక్షిణం వైపు ఇల్లు( House ) కట్టుకుంటే అన్ని కష్టాలే ఉంటాయి అనే వారి మాటలు అసలు నమ్మవద్దని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

దక్షిణం వైపు ఇల్లు కట్టుకున్న కూడా పాటించాల్సిన వాస్తు నియమాలు పాటిస్తే ఎలాంటి దోషాలు ఉండవని చెబుతున్నారు.అలాగే చాలా మందికి ఇల్లు కట్టించుకునే స్తోమత ఉంటుంది.

కానీ వాస్తు ప్రకారం కట్టించుకోవడానికి వీలు ఉండదు.ఉండడానికి ఒక ఇల్లు ఉంటే చాలు అనుకునే వారు కూడా ఎంతో మంది ఉన్నారు.

Telugu Vastu, Kuja Graha, Temple, Vastu Shastra, Vastu Tips-Latest News - Telugu

మరి అలాంటి వారికి ఇల్లు దక్షిణం వైపు ఉన్న అది దేవాలయం తో( Temple ) సమానమే అని చెబుతున్నారు.ఆ దిశకు సంబంధించిన దేవుడి చిత్రాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది.అయితే దక్షిణం వైపు నిర్మించిన ఇల్లు అన్ని రంగాల వారికి మంచి చేస్తాయని చెప్పలేము.అలాంటి ఇంట్లో ఉండాలనుకునే వారి జాతకం, వృత్తి ప్రకారం అలాంటి ఇంట్లో ఉండవచ్చా లేదా అని చూసుకోవాలి.

దక్షిణానికి అధిపతి కుజుడు.అంటే రియల్ ఎస్టేట్, హెల్త్ ఇండస్ట్రీలో పనిచేసే వారికి ఈ దక్షిణం వైపు ఇళ్లలో నివసించేందుకు వీలు ఉంటుంది.

అంతేకాకుండా సినిమా వారికి కూడా దక్షిణం బాగా కలిసి వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube