Mukku Avinash : బిడ్డను కోల్పోవడం గురించి మరోసారి అవినాష్ ఎమోషనల్.. ఇంకా బెస్ట్ రాబోతుందేమో అంటూ?

తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ ( mukku avinash )గురించి మనందరికీ తెలిసిందే.జబర్దస్త్ షోలో తనదైన శైలిలో కామెడీ చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు అవినాష్.

 Comedian Mukku Avinash First Response On His Baby Loss-TeluguStop.com

జబర్దస్త్ షో ( Jabardasth Show )ద్వారానే బాగా పాపులర్ అయ్యారు.తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించడంతో పాటు అప్పుడప్పుడు వెండితెరపై సినిమాలలో కూడా మెరుస్తూ ఉంటాడు.

అయితే మొన్నటి వరకు జబర్దస్త్ షోలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను అలరించిన అవినాష్ ప్రస్తుతం జబర్దస్త్ షో కి దూరమైన విషయం తెలిసిందే.ప్రస్తుతం శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్న స్టార్ మా విత్ పరివారం( Star ma with parivaram ) అనే షోలో చేస్తున్నాడు.

ఇటీవలే అవినాష్ ఒక ఇంటివాడైన విషయం తెలిసిందే.త్వరలో తండ్రి కూడా కాబోతున్నాడు అని అవినాష్ తో పాటు కుటుంబ సభ్యులు అభిమానులు అందరూ కూడా చాలా సంతోషపడ్డారు.కానీ ఆ సంతోషం ఎక్కువకాలం లేకుండా పోయింది.తమ బిడ్డను పురిట్లోనే కోల్పోయినట్లు తెలిపాడు అవినాష్.ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక సుదీర్ఘమైన వివరణ ఇస్తూ పోస్ట్ చేశాడు.దీంతో అతడి అభిమానులు ఖంగుతిన్నారు.

అవినాష్ తన ఇన్‌స్టాలో నా లైఫ్‌లో సంతోషమైనా, బాధ అయినా మీతోనే పంచుకుంటాను.ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను.

కానీ మొదటి సారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను.

మేము అమ్మ నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూసాం.కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డనీ కొల్పోయాము అని పోస్ట్ చేశాడు అవినాష్.దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు.

మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ.మీ అనూజ అవినాష్ అని రిక్వెస్ట్ చేశాడు.

దీంతో అవినాష్‌ను ఎవరూ ఏ సందర్భంలోనూ ఈ దుర్ఘటన గురించి ప్రశ్నించలేదు.ఫలితంగా ఈ విషాదం గురించి చాలా మంది త్వరగానే మర్చిపోయారు.

తాజాగా ఇదే విషయం గురించి మరొకసారి స్పందించిన అవినాష్.నేను రిక్వెస్ట్ చేయడంతో చాలా మంది త్వరగానే దీన్ని మర్చిపోయారు.

కానీ, కొందరు సినిమా వాళ్లు కానీ, అభిమానులు కానీ ఓదార్చడం కోసం ఫోన్లు చేశారు.కానీ, నేనే వేటికీ రెస్పాండ్ కాలేదు.

వాళ్లకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక ఏమీ మాట్లాడలేకపోయాను అని వెల్లడించాడు.ఈ ఘటన నుంచి మేము త్వరగానే కోలుకున్నాము.

నా లైఫ్‌లో ఇది కరిగిపోయిన మేఘం లాంటిది.ఏమో.ఫ్యూచర్‌లో మాకు ఇంకా బెస్ట్ రాబోతుందేమో అని అనుకుంటున్నాను.ఈ విషయంలో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరినీ ధన్యవాదాలు అని తెలిపారు అవినాష్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube