మనకు తెలిసినంత వరకు చాలా చోట్ల ఏ పండ్లో, స్వీట్లో, పులిహోరనో లేదా దద్దోజనమో, వడలో, గారెలో.ఇలా రకరకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు.
మరీ ఘాటుగా ఉండే ఎలాంటి వాటిని నైవేద్యంగా సమర్పించడం మనం చూడం.కానీ ఓ చోట మాత్రం స్పైసీ ఫుడ్ ఐటమ్స్ అయిన మిర్చి బజ్జీ, సమోసా, ఆలూ బోండా, కచోరీలను నైవేద్యంగా సమర్పిస్తారు.
అదెక్కడ ఉందో, అమ్మవారికి మిర్చి బజ్జీ, సమోసా, ఆలూ బోండా, కచోరీలను ప్రసాదంగా ఎందుకు సమర్పిస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఛత్తీస్ గడ్ రాయ్ పూర్ లోని పాతబస్తీ ప్రాంతంలోని శీత్లా మందిర్ సమీపంలో ఉన్న ధూమావతి ఆలయంలో స్పైసీ పధార్థాలను ప్రసాదంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ ఆలయాన్ని పదేళ్ల క్రితం నీరజ్ సాయి అనే పూజారి ఈ ఆలయాన్ని నిర్మించారు.అయితే ధూమావతి అమ్మవారికి. సమోసాలు, కచోరి, మిర్చి బజ్జీ, ఆలూ బోండా వంటి స్పైసీ పదార్థాలను ప్రసాందంగా సమర్పిస్తున్నారు.ఇక్కడ తప్ప ఇలాంటి ప్రసాదాలు దేశంలో మరెక్కడా సమర్పించరు.
స్పైసీ పదార్థాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టమని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.అందుకే అందరూ ఇలాంటి పదార్థాలనే నైవేద్యంగా సమర్పిస్తున్నారని పూజారి నీరజ్ చెబుతున్నారు.
అంతే కాదండోయ్ ఇక్కడ అమ్మవారిని జ్యోతి బిందు రూపంలో ఆరాధిస్తారు.దేవత విగ్రహం లాంటివి ఏం కనిపించవు.
అమ్మ వారి రూపంలోకపోయినప్పటికీ భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పూజలు చేస్తుంటారు.