మనకు నాలుగు వేదాలు 18 మహా పురాణాలు ఉన్నాయి.ఈ వేదాలు పురాణాలలో జీవితం, జీవిత సారాంశం ఉంటుందని వేద పండితులు చెబుతూ ఉంటారు.18 మహా పురాణాలలో గరుడ పురాణం కూడా ఒకటి.ఇది విష్ణు అతని వాహనం గరుడ పక్షి మధ్య జరిగిన సంభాషణను తెలుపుతుంది.
మెరుగైన జీవితం గడపడం మరణం తర్వాత సంఘటనలను వివరించే అవకాశం ఉంది.దీనితో పాటు జీవితానికి సంబంధించిన ప్రత్యేక విషయాలు కూడా గరుడ పురాణంలో ఉన్నాయి.
రోజును ఎలా ప్రారంభించాలి.అలా చేయకుంటే ఆరోజు అసంపూర్ణంగా భావిస్తారు.
ఇలాంటి పనులను క్రమం తప్పకుండా చేయడం వల్ల ఒక వ్యక్తి రోజంతా శుభప్రదంగా ఉంటాడని అంతేకాకుండా అనేక సమస్యల నుండి బయటపడి సంతోషమైన జీవితాన్ని గడుపుతాడని పురాణాలలో ఉంది.
వీటిని పాటించడం వల్లజీవితంలో ఆనందం ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది.
ఆనందంతో పాటు అదృష్టం కూడా ఉండే అవకాశం ఉంది.ఈ పనులు చేయడం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి మరణం తర్వాత కూడా మోక్షం పొందుతాడు.
అన్నదానం చేయడం మనిషి జీవితంలో అతిపెద్ద పుణ్యంగా గరుడ పురాణంలో ఉంది.ప్రతిరోజు ఆకలితో ఉన్న పేదవారికి మీ స్థాయికి బట్టి ఆహారం దానం చేస్తే మీకు పుణ్యం లభిస్తుంది.
ఒక వ్యక్తి ఎంత ఒత్తిడిలో ఉన్నా ధ్యానం చేస్తే ఆ ఒత్తిడి అంతా తగ్గిపోతుంది.ఎందుకంటే ధ్యానం మీ శరీరం మనసుపై ఎంతో ప్రభావం చూపుతుంది.
కానీ గరుడ పురాణం ప్రకారం ధ్యానం అంటే జపం అని అర్థం.ఒక వ్యక్తి ప్రతిరోజు కొంత సమయం పాటు ప్రశాంతమైన మనసుతో ధ్యానం చేయడం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత ఉంటుంది.
ఇంట్లో కొందరు వండిన ఆహారాన్ని స్వయంగా భోజనం వడ్డించి తినడం మొదలుపెడతారు.కానీ గరుడ పురాణంలో ఏమి ఉందంటే ఇంట్లో చేసిన ఆహారం ముందుగా దేవునికి నైవేద్యం సమర్పించాలి.ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం తో పాటు అన్నపూర్ణ కూడా ఉంటుందని గరుడ పురాణంలో ఉంది.