సాధారణంగానే చాలామంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని కచ్చితంగా నమ్ముతారు.వారి జీవితంలో ప్రతి విషయాన్ని వాస్తు ప్రకారమే చేస్తూ ఉంటారు.
ఎందుకంటే ఏ విషయమైనా వాస్తు ప్రకారం చేస్తే ఎలాంటి ఇబ్బందులు అయినా తొలగిపోతాయని వారి నమ్మకం.అందుకోసమే చాలామంది ప్రజలు కచ్చితంగా ఫాలో అవుతూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే వాస్తు ప్రకారమే ఇంట్లో సామాన్లను అమర్చుకుంటూ ఉంటారు.వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని లాభాలు తగ్గిపోతాయని ధన నష్టం జరుగుతుందని అందరూ వాస్తవం ఫాలో అవుతూ ఉంటారు.
అంతేకాకుండా వాస్తు పండితులు ధనవంతుడు అవ్వాలంటే రహస్యం అద్దంలో ఉంది అని చెబుతున్నారు.మరి దానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా అద్దం ఉంటుంది.అడ్డం వెనుక కూడా వాస్తు నడుస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పగిలిపోయిన అద్దాన్ని కానీ విరిగిపోయిన దాన్ని అస్సలు ఉంచుకోకూడదు.దీనివల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు వచ్చి సానుకూల శక్తులు బయటకు వెళ్లే ప్రమాదం ఉంది.

ఇంకా చెప్పాలంటే ఇంట్లో అద్దం ఉంటే మన తలరాతను మార్చేస్తుంది.కాబట్టి అద్దం విషయంలో ఆ జాగ్రత్త అస్సలు పనికిరాదు.అద్దం కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవడం మంచిది.సరేనా దిశలో అద్దాన్ని పెట్టకపోతే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వచ్చి, ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
చాలామంది ఇళ్లలో బెడ్రూంలో అద్దాన్ని పెడుతూ ఉంటారు.బెడ్ రూమ్లో పెట్టేటప్పుడు మంచానికి ఎదురుగా ఎప్పుడూ అద్దం పెట్టకూడదు.
ఒకవేళ కనుక మంచం ఎదురుగా అద్దం పెడితే దాని వలన ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.చాలామంది చోటు సరిపోవడం లేదని మంచానికి ఎదురుగా అడ్డం పెడుతూ ఉంటారు.
కానీ ఇది అసలు మంచిది కాదు.అద్దానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే మీరు వాస్తు పండితులను అడిగి తెలుసుకోవడం మంచిది.
అలా వాస్తు పండితులు చెప్పిన దాని ప్రకారం ఫాలో అవ్వడం వల్ల మీకు శుభం జరిగే అవకాశం ఉంది.