డెజర్స్›్ట అంటే ఇష్టం లేని వారు ఉండరు.కానీ, ఇందులో ఉండే కేలరీస్‌తో కాస్త వెనుకడుగు వేయక తప్పదు.
అయితే, ఈ పదిరకాల ఆరోగ్యకరమైన డెజర్ట్స్‌ను ఎటువంటి అనుమానం లేకుండా తినవచ్చు.ఆ ఆహారపదార్థాలు ఏంటో తెలుసుకుందాం.
తాజా పండ్లుతాజా పండ్లలో మినరల్స్, విటమిన్స్ ఉంటాయి.ఇది మీ శరీర పనితీరును మెరుగుపరుస్తుంది.ముఖ్యంగా సీజనల్ పండ్లను తినడం మంచిది.పీయర్స్, వాటర్‌మిలన్, జామ వంటివి తినాలి.
సీజనల్ ప్రూట్స్ చాలా రుచిగా ఉంటాయి.వాటిని ప్రాసెస్, ప్రిసెర్వ్ చేయలేరు.
తాజా పండ్లు అందుబాటులో లేకపోతే .ఫ్రోజెన్ ప్రూట్స్‌ను తినాలి.
డార్క్ చాకొలేట్స్86 శాతం డార్క్ చాక్లెట్లలో 15 గ్రాములు చాకోలేట్ ఉంటే.కేవలం రెండు గ్రాములు మాత్రమే చక్కెర ఉంటుంది.కానీ, మన నోటికి చాలా తీయగా ఉంటుంది.పైగా ఇందులో ఫ్లవోనాయిడ్స్ అనే ప్లాంట్ కెమికల్స్ ఉంటాయి.
అది మన హృదయానికి చాలా మంచిది.

యాపిల్ చిప్స్‌యాపిల్ మన గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.డయాబెటీస్, కొన్ని రకాల కేన్సర్‌లకు కూడా యాపిల్‌తో చెక్ పెట్టవచ్చు.కాస్త వెరైటీ డిష్‌లను ఇష్టపడేవారు క్రిస్పీగా ఉండే యాపిల్ చిప్స్‌ను ఒసారి ప్రయత్నించండి.
తయారు చేసుకునే విధానం.యాపిల్‌లను చిన్న స్లైస్‌ల మాదిరి కట్‌చేసుకోవాలి.వాటిని గ్రీస్ చేసిన బేకింగ్ షీట్‌పై పెట్టి, కొద్దిగా యాపిల్ పీకి సంబంధించిన మసాలను చల్లి గంటపాటు.225 డిగ్రీల్లో బేక్ అవ్వనివ్వాలి.మళ్లీ వాటిని కలియతిప్పి మరో గంటపాటు ఇదేవిధంగా బేక్ చేసుకోవాలి.
సెరీల్స్‌సెరీల్స్ కూడా వందశాతం ఆరోగ్యవంతమైన మంచి స్నాక్.
లోఫ్యాట్ డైరీ మిల్క్ లేదా స్వీట్ లేనివి కూడా ఉంటాయి.
గ్రీక్ యోగార్ట్‌ఫ్లేవర్డ్ యోగార్ట్‌ల కంటే ప్లెయిన్ లోఫ్యాట్ గ్రీక్ యోగార్ట్‌లో కాస్త దాల్చినచెక్క వేసి కలపాలి.
ఇది మీ శరీరానికి అవసరమైన క్యాల్షియాన్ని అందిస్తుంది.ఇది ఎక్కువ రోజులపాటు హెల్తీగా ఉంచుతుంది.

ఖర్జూరంఖర్జూరంలో సహజసిద్ధమైన చెక్కర గుణం ఉంటుంది.అందుకే చాలా రెసిపీల్లో చక్కెరకు బదులుగా వీటిని ఉపయోగిస్తుంటారు.అంతేకాదు, డేట్స్‌లో ఫైబర్, విటమిన్ బీ6, పొటాషియం, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటాయి.
ఓట్‌మీల్‌ప్రీ ఫ్లేవర్డ్ ఓట్‌మీల్‌లో ఎక్కువ శాతం చెక్కర ఉంటుంది.
దీనికి ఓ స్పూన్ మాపిల్ సిరప్‌ను యాడ్ కూడా చేసుకోవచ్చు.దాల్చినచెక్క పొడిని కూడా జత చేసి తీసుకోవచ్చు.
ఫ్రోజెన్ గ్రేప్స్‌ఈ ఫ్రోజెన్ గ్రేప్స్ మంచి స్నాక్.ఈ గ్రేప్స్ ఫ్రీజ్‌లో పెట్టిన తర్వాత మరింత స్వీట్‌గా ఉంటాయి.దీన్ని కడిగి శుభ్రం చేసి వాటిని బేకింగ్ షీట్‌పై పెట్టి వాటిని డీప్ ఫ్రీజర్‌లో ఐసీ క్రంచ్ అయ్యే వరకు పెట్టుకోవాలి.

స్వీట్ పొటాటోఇది సహజసిద్ధమైన స్వీట్ వెజిటేబుల్.దీనిలో విటమిన్ ఏ, బీ6, సీ తో పాటు ఆరోగ్యవంతమైన ప్లాంట్ కెమికల్స్ ఉంటాయి.వీటిని బేక్ చేసుకుని తినవచ్చు.
లేదా మైక్రోవేవ్‌లో పొటాటో తయారు చేసుకుని, వెనీలా యోగార్ట్‌తో టాపింగ్ వేసుకుని మ్యాపిల్ సిరప్‌ను పైన వేసుకోవచ్చు.దీంతో పొటాటో చిప్స్ కూడా తయారుచేసుకోవచ్చు.
యాపిల్, నట్ బటర్‌యాపిల్ స్లైసులపై ఓ స్పూన్ నట్ బటర్‌ను వేసి, దాల్చిన చెక్కపొడిని చల్లుకుని తింటే కూడా బావుంటుంది.దాల్చినీలో అదనపు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.