సాధారణంగా కొందరి పెదాలు గులాబి రంగులో అందంగా మెరిసిపోతూ ఉంటాయి.మరికొందరి పెదాలు మాత్రం డార్క్‌గా, నిర్జీవంగా కనిపిస్తుంటాయి.
ఇలాంటి వారు డార్క్ లిప్స్‌ను కవర్ చేసుకునేందుకు లిప్ స్టిక్స్‌పై ఆధారపడుతుంటారు.అయితే ఇకపై కవరింగ్ అక్కర్లేదు.
ఇప్పుడు చెప్పబోయే హోం మేడ్ లిప్ బామ్ ను యూస్ చేస్తే మీ పెదాలు సహజంగానే గులాబి రంగులోకి మారతాయి.మరి లేటెందుకు ఆ లిప్ బామ్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో ఒక కప్పు ఫ్రెష్ గులాబి రేకలు వేసి మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.
ఇలా ఉడికించిన గులాబి రేకలను వాటర్‌తో సహా మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి.జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల బీస్ వ్యాక్స్ తురుము, వన్ టేబుల్ స్పూన్ షియా బటర్, వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, వన్ టేబుల్ స్పూన్ ఆముదం, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్, ముందుగా తయారు చేసి పెట్టుకున్న గులాబీ జ్యూస్ మూడు టేబుల్ స్పూన్లు వేసుకుని కలపాలి.

ఇప్పుడు ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో పెట్టి మెల్ట్ చేసుకోవాలి.ఇలా మెల్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బాక్స్‌లో నింపుకుని ఓ గంట పాటు వదిలేస్తే లిప్ బామ్ సిద్ధం అవుతుంది.ఈ హోం మేడ్ లిప్ బామ్‌ను రోజుకు రెండు లేదా మూడు యూస్ చేస్తూ ఉంటే.
మీ పెదాలు సహజంగానే గులాబి రంగులోకి మారతాయి.మరియు డ్రై లిప్స్ సమస్య నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.