ఎండల వల్ల మీ స్కిన్ టోన్ తగ్గిపోయిందా.. అయితే మీరీ హోమ్ మేడ్ క్రీమ్ వాడాల్సిందే!

ప్రస్తుతం సమ్మర్ సీజన్ కొనసాగుతోంది.ఈ ఎండలు కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలే కాదు చర్మ సమస్యలు కూడా ఇబ్బంది పెడుతుంటాయి.

 Homemade Cream For Improving Skin Tone! Skin Tone, Skin Tone Improving Cream, Fa-TeluguStop.com

ముఖ్యంగా ఎండల వల్ల తమ స్కిన్ టోన్ తగ్గిపోయిందని చాలామంది బాధపడుతుంటారు.ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ క్రీమ్ ను మీరు వాడాల్సిందే.ఈ క్రీమ్ చర్మాన్ని తెల్లగా మార్చడానికే కాదు మరెన్నో స్కిన్ కేర్ బెనిఫిట్స్ ను అందిస్తుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక నిమ్మ పండు మరియు ఒక ఆరెంజ్( Orange ) ల‌ను తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి వాటికుండే పీల్ ను సపరేట్ చేసుకోవాలి.

అలాగే ఒక చిన్న క్యారెట్ ను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాసుల వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే ఆరెంజ్ మరియు లెమన్ తొక్కలను వేసుకోవాలి.అలాగే కట్‌ చేసి పెట్టుకున్న‌ క్యారెట్ ముక్కలతో పాటు రెండు టేబుల్ స్పూన్లు బియ్యాన్ని వేసి న‌ది నిమిషాల‌ పాటు ఉడికించాలి.

Telugu Tips, Face Cream, Latest, Skin Care, Skin Care Tips, Skin Tone, Skin Tone

ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఉడికించిన పదార్థాలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్,( Aloe Vera Gel ) వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, హాఫ్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Sweet Almond Oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన క్రీమ్ సిద్ధమవుతుంది.

ఈ క్రీమ్ ను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ఈ క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుని నిద్రించాలి.

Telugu Tips, Face Cream, Latest, Skin Care, Skin Care Tips, Skin Tone, Skin Tone

రోజు ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను వాడితే స్కిన్ టోన్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.ఎండల వల్ల నల్లగా మారిన చర్మం కొద్ది రోజుల్లోనే తెల్లగా కాంతివంతంగా మారుతుంది.అలాగే ఈ క్రీమ్ ను వాడితే మొండి మచ్చలు మొటిమలు మాయం అవుతాయి.స్కిన్ టైట్ గా మారుతుంది.వయసు పై బడిన యంగ్ గా కనిపిస్తారు.మరియు స్కిన్ షైనీగా సైతం మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube