సాధారణంగా కొందరు ఉండాల్సిన బరువు కంటే చాలా తక్కువగా ఉంటారు.బక్కగా బలహీనంగా ఉన్నవారు అనేక అనారోగ్య సమస్యను ఫేస్ చేస్తుంటారు.
ఈ క్రమంలోనే బరువు పెరగడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే స్మూతీ సూపర్ ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.వారానికి ఈ స్మూతీని మూడు సార్లు తీసుకున్న చాలు.
బెటర్ రిజల్ట్ మీరు గమనిస్తారు.మరి వెయిట్ గెయిన్( Weight gain ) కు సహాయపడే ఆ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక అరటి పండును తీసుకొని పీల్ తొలగించి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటిపండు స్లైసెస్ వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్( Chia seeds ), రెండు టేబుల్ స్పూన్లు వేయించి పొట్టు తొలగించిన వేరు శనగలు, వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ పెరుగు, ఒక గ్లాసు హోమ్ మేడ్ బాదం పాలు మరియు మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన స్మూతీ సిద్ధం అవుతుంది.
ఈ బనానా పీనట్ స్మూతీ టేస్టీగా ఉంటుంది.అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా తక్కువ బరువు ఉన్నవారు తరచూ ఈ స్మూతీని తీసుకుంటే చాలా మంచిదని చెప్పచ్చు.
ఆరోగ్యంగా బరువు పెరగడానికి ఈ స్మూతీ సహాయపడుతుంది.అలాగే బలహీనతను దూరం చేస్తుంది.
కాబట్టి బరువు పెరగాలనుకునే వారు తప్పకుండా ఈ స్మూతీని ట్రై చేయండి.పైగా, డైట్ లో ఈ టేస్టీ స్మూతీని చేర్చుకోవడం వల్ల ఎముకలు కండరాలు స్ట్రోంగ్ గా మారతాయి.
బ్రెయిన్ షార్ప్ గా పని చేస్తుంది.రక్తపోటు( Blood pressure ) అదుపులో ఉంటుంది.
మరియు జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా సైతం పెరుగుతుంది.
.