ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలను ప్రధానంగా ఇబ్బంది పెట్టే వాటిలో గ్యాస్ట్రిక్(గ్యాస్) సమస్యే ముందు వరసలో ఉంటుంది.గర్భధారణ సమయంలో హార్మోనుల మార్పుల వల్ల గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది.
ఈ సమస్య కారణంగా స్త్రీలు ప్రెగ్నెన్నీ సమయాన్ని ఎంజాయ్ చేయలేకపోతుంటారు.అలాగే ఏ ఆహారాలు తినాలన్నా తెగ భయపడుతూ ఉంటారు.
మరియు తీవ్ర అసౌకర్యానికి కూడా గురవుతుంటారు.ఈ నేపథ్యంలోనే గ్యాస్ట్రిక్ను నివారించుకునేందుకు మందులు వాడుతుంటారు.
అయితే ఇంట్లోనే చేసుకునే చిన్న పాటి చిట్కాల ద్వారా కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రెగ్నెన్సీ సమయంలో గ్యాస్ వేధిస్తుంటే ధనియాలను వాడొచ్చు.ఒక కప్పు వాటర్‌లో అర స్పూన్ ధనియాల పొడి వేసి మరిగించి గోరు వెచ్చగా అయిన తర్వాత తీసుకోవాలి.ఇలా చేస్తే వెంటనే రిలీఫ్ పొందుతారు.
అలాగే గ్యాస్ కు కల్లెం వేయడంతో మజ్జిగ కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది.
అవును, ఒక గ్లాస్ మజ్జిగ తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్య పరార్ అవుతుంది.మజ్జిగకు బదులుగా కాచి చాల్లార్చిన పాలు లేదా కొబ్బరి నీరైనా తీసుకోవచ్చు.
ఇవి కూడా గ్యాస్ట్రిక్ సమస్యను నివారిస్తాయి.

ప్రెగ్నెన్సీ సమయంలో ఆహారాన్ని ఎప్పుడూ కూడా ఒకేసారి తీసుకోరాదు.ఇలా చేయడం వల్ల కూడా గ్యాస్ సమస్య ఇబ్బంది పెడుతుంది.అందుకే, ఆహారాన్ని కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తీసుకోవాలి.
మరియు తినే ఆహారం బాగా నమిలి మింగాలి.దాంతో ఫాస్ట్‌గా జీర్ణమై గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది.
ఒక గ్లాస్ వాటర్‌లో మూడు దంచిన యాలకును వేసి బాగా మరిగించాలి.ఆ తర్వాత నీటిని వడబోసుకుని సేవించాలి.ఇలా చేసినా కూడా గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
ఇక ప్రెగ్నెన్సీ సమయంలో కారం, మసాలా వంటలకు దూరంగా ఉండాలి.
బీన్స్, వెల్లుల్లి, బ్రొకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజ్, ఉల్లి, డైరీ ప్రొడక్ట్స్ వంటి ఆహారాలను తీసుకోవడం తగ్గించాలి.ఎందుకంటే, ఇవి గ్యాస్‌కు కారణం అవుతాయి.