శ్రీవారి సర్వదర్శనానికి ఎంత సమయం పడుతుందంటే.. తిరుమల తిరుపతి దేవస్థాన ఈవోగా ఈయన నియామకం..

శ్రీవారి సర్వ దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తున్న భక్తుల రద్దీ అధికంగా ఉండడం వల్ల శ్రీవారి దర్శనానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది.గురువారం సాయంత్రానికి ఎస్ ఎస్ డి టోకెన్లు లేకుండా సర్వ ధర్మ దర్శనానికి క్యూ లైన్ లో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ లైన్ కాంప్లెక్స్ లోనీ 31 కంపార్ట్మెంట్లలో, నారాయణగిరి లోని 6 సెడ్లలలో వేచి ఉన్నారు.

 Anil Kumar Singhal Appointed As Temporary Eo Of Ttd Details, Anil Kumar Singhal-TeluguStop.com

వీరికి దాదాపు 22 గంటల్లో స్వామి వారి దర్శనం లభించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.బుధవారం శ్రీవారిని దాదాపు 70 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు సమాచారం.

హుండీ కానుకలుగా నాలుగు కోట్ల రూపాయలు జమ అయినట్లు అధికారికంగా ప్రకటించారు.గదుల కోసం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.ఎందుకంటే చలి తీవ్రత పెరగడం వల్ల వసతి గదుల కోసం భక్తులు పోటీ పడుతున్నారు.మన రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘల్ కు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులను జారీ చేస్తున్నట్లు ప్రకటించారు.

తన కుమారుడు గుండెపోటుతో మృతి చెందడంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డికి ప్రభుత్వం 12 రోజులు సెలవును మంజూరు చేసినట్లు సమాచారం.దీనివల్ల తిరుపతి దేవస్థానం జేఈవో వీర బ్రహ్మం తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓ గా నియమించినట్లు సమాచారం.జనవరి 3న తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ధర్మారెడ్డి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

అప్పటివరకు రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘల్ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube