అన్నంత పనిచేసిన కువైట్...300 పైగా వలస వాసుల అరెస్ట్...!!

అరబ్బు దేశాలకు వలసలు వెళ్ళే వారు తప్పకుండా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అక్కడి ప్రభుత్వం, ప్రజలు పాటించే నియమ, నిభందనలు, ఆచార వ్యవహారాలు.ఎందుకంటే అక్కడి సాంప్రదాయాలకు విరుద్దంగా ఎలాంటి పనిచేసినా వారిపై కటినమైన చర్యలు తీసుకుంటారు.

 Kuwait Arrests Over 300 Migrants , Kuwait , 300 Migrants, Arab Countries, Gove-TeluguStop.com

రూల్స్ బ్రేక్ చేసినా, ఎవరినైనా దూషించిన, అలాగే ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో నిభందనలు అరబ్బు దేశాలలో ఉంటాయి.అందుకే ఆయా దేశాలకు వెళ్ళే ముందు తప్పనిసరిగా అన్ని రూల్స్ తెలుసుకుని వెళ్ళాల్సిందే.

అయితే రూల్స్ ను బ్రేక్ చేసినందుకు గాను తాజాగా కువైట్ ప్రభుత్వం దాదాపు ౩౦౦ మంది వలస వాసులపై కటినమైన చర్యలు తీసుకుంది.

కువైట్ ప్రభుత్వం సరిగ్గా రెండు నెలల క్రితం ఎక్కువ వాహనాలు ఉంటూ కనీసం రిజిస్ట్రేషన్ కూడా చేయించుకొని వారిపై చర్యలు చేపడుతామని, వారి లైసెన్స్ లు రద్దు చేస్తామని హెచ్చరించింది.

అలాగే రెసిడెన్సీ గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్న వారిపై కూడా కటినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.ఈ నేపధ్యంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా పెద్ద మొత్తంలో రూల్స్ ను అతిక్రమించిన దాదాపు ౩౦౦ మందిని అరెస్ట్ చేశారు.

వీరందరూ నాన్ రెసిడెంట్స్ కావడం మరొక విశేషం.ఇలా అరెస్ట్ చేసిన వారిలో ఎక్కువగా 250 మంది రెసిడెంట్ గడుపు ముగిసినా ఇక్కడ ఏళ్ళ తరబడి ఉంటున్నారని గుర్తించి షాక్ అయ్యారు.

అలాగే మిగిలిన వారిలో కొందరు పారిపోయిన కేసుల్లో ఉన్నారని పోలీసులు గుర్తించారు.ఈ 250 మంది వద్ద 80 వాహనాలు ఉండగా వాటిని సీజ్ చేశారు పోలీసులు.

గడువు తీరిన తరువాత కూడా దేశంలో ఉండేందుకు అనుమతులు పొందాలి కదా అని అధికారులు వలస వాసులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.ఈ క్రమంలో ఇంకేమన్నా ఇతర నిభందనలు వారు అతిక్రమించారా అనే వివరాలు శోధిస్తున్నామని, ఇంకెలాంటి ఉల్లంఘనలు ఉన్నా వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు దేశ బహిష్కర చేపడుతామని హెచ్చరించారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube