నిద్ర.ఇది చాలా మందికి ఇష్టం.కానీ అందరికీ అవసరం.కొందరు నిద్రలేమీ సమస్యతో చాలా బాధపడుతుంటారు.మరి కొందరు ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉంటారు.ఈ రెండూ ప్రమాదకరమే.
అయితే వీటిలో ఎక్కువ మంది నిద్రలేమీ సమస్యను ఎదుర్కొంటున్నవారే ఉన్నారు.అయితే నగ్నంగా నిద్ర పోవడం వల్ల నిద్రలేమీ సమస్యను జయించవచ్చని చెబుతున్నాయి అధ్యయనాలు.
మన దేశంలో ఇలాంటి వారు 2 శాతం మంది ఉన్నారు.వినడానికి కాస్త డిఫరెంట్‌గా ఉన్నా ఇది నిజం.
విదేశాల్లో సుమారు 100 మందిలో 40 మంది నగ్నంగా నిద్రపోతారట.దీనిని పసిపిల్లల నిద్ర అని చెబుతుంటారు.
ఎందుకంటే పుట్టిన పిల్లలు ఒంటిపై దుస్తులు లేకుండా కేవలం దుప్పటి కప్పుకుని మాత్రమే పడుకుంటారు కదా.అయితే ఇలా నగ్నంగా నిద్రపోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నాయి అధ్యయనాలు మరి అవేంటో తెలుసుకుందామా?
ఒంటి మీదు దుస్తులు లేకుండా ఉంటే శరీరంలోని ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.దీని వల్ల రక్తం చల్లబడుతుంది.ఫలితంగా త్వరగా నిద్రపోవచ్చు.దీని వల్ల చర్మం సైతం కాంతి వంతంగా మారుతుంది.బిగుతుగా ఉండే దుస్తులు శరీరంపై ఒత్తిడిని తెస్తాయి.
నగ్నంగా పడుకోవడం వల్ల ఆ ఒత్తిడి దూరమవుతుంది.నగ్నంగా నిద్రపోవడం వల్ల పురుషుల్లో సంతాన సమస్యలు తలెత్తవట.
అండర్ వేర్, షార్ట్, లుంగీల వల్ల పురుషాంగానికి గాలి తగలదు.
దీని వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందని చెబుతున్నాయి అధ్యయనాలు.నగ్నంగా నిద్రపోవడం వల్ల అధిక బరువును సైతం నివారించవచ్చట.మహిళలు నగ్నంగా నిద్రపోవడం వల్ల జననేంద్రియాలు ఆరోగ్యంగా ఉంటాయని గైనకాలజిస్టులు చెబుతున్నారు.
వీటితో పాటు అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.కానీ మన దేశంలో ఫ్యామిలీతో కలిసి ఉన్న వారికి ఇది సాధ్యం కాదు.
ఒంటరిగా లేదా లైఫ్ పార్ట్నర్ తో కలిసి జీవిస్తున్న వారికి మాత్రమే నగ్నంగా నిద్రపోవడం సాధ్యమవుతుంది.అందుకే మన దగ్గర నగ్నంగా నిద్రపోయే వారి శాతం తక్కువగా ఉంది.