విజయ్ దేవరకొండ ఆ సినిమా చేసి పెద్ద తప్పు చేశాడా..?

పెళ్లి చూపులు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన విజయ్ దేవరకొండ( Vijay Deverakonda) ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్నప్పుడే ఆయనకి అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు.ఇక ఆ తర్వాత వచ్చిన వరుస సినిమాలతో కొంతవరకు డీలో పడ్డట్టుగా తెలుస్తుంది.

 Did Vijay Devarakonda Make A Big Mistake By Making That Movie, Pelli Choopulu, T-TeluguStop.com

ఇక ఈయన అనవసరంగా ఒప్పుకొని చేసిన సినిమా ఏంటి అంటే ఫ్యామిలీ స్టార్( The Family Star) ఈ సినిమా అనవసరంగా ఒప్పుకొని చేశానని ఇప్పుడు తన సన్నిహితుల దగ్గర చెబుతున్నట్టుగా తెలుస్తుంది.

ఎందుకంటే ఈ సినిమాలో విజయ్ ఇమేజ్ కి సరిపడా కథ లేదు.ఇక అసలు కథలో పెద్దగా మ్యాటర్ అయితే ఏమీ లేదు.ఏదో పాత స్టోరీని తీసుకొచ్చి ఈ జనరేషన్ కి తగ్గట్టుగా చిన్న మార్పులు చేర్పులు చేసి చేసినట్టుగా అనిపించింది.

 Did Vijay Devarakonda Make A Big Mistake By Making That Movie, Pelli Choopulu, T-TeluguStop.com

అంతే తప్ప పెద్దగా కొత్తదనం అయితే ఏమీ లేదు.కాబట్టి ఈ సినిమా బాక్సఫిస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.ఇక ఇప్పుడు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ సినిమా చేసినందుకు విజయ్ మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడట.

అయితే గీతగోవిందం ( Geetha Govindam)లాంటి సూపర్ సక్సెస్ కాంబినేషన్ కాబట్టి విజయ్ ఈ సినిమాని ఒకే చేశాడు కానీ లేకపోతే మాత్రం అసలు ఈ సినిమా చేసేవారు కాదేమో అంటూ మరి కొంతమంది వాళ్ల అభిప్రాయాలను అయితే తెలియజేస్తున్నారు.ఇక మొత్తానికైతే విజయ్ ప్రస్తుతం వరుసగా మూడు సినిమాలతో సక్సెస్ లు కొట్టాలని చూస్తున్నాడు.అందుకే ఈ మూడు సినిమాలే అతన్ని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మార్చే సినిమాలు అంటూ మరి కొంతమంది ఆయన అభిమానులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదిక గా తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube