విజయ్ దేవరకొండ ఆ సినిమా చేసి పెద్ద తప్పు చేశాడా..?

పెళ్లి చూపులు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన విజయ్ దేవరకొండ( Vijay Deverakonda) ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్నప్పుడే ఆయనకి అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు.

ఇక ఆ తర్వాత వచ్చిన వరుస సినిమాలతో కొంతవరకు డీలో పడ్డట్టుగా తెలుస్తుంది.

ఇక ఈయన అనవసరంగా ఒప్పుకొని చేసిన సినిమా ఏంటి అంటే ఫ్యామిలీ స్టార్( The Family Star) ఈ సినిమా అనవసరంగా ఒప్పుకొని చేశానని ఇప్పుడు తన సన్నిహితుల దగ్గర చెబుతున్నట్టుగా తెలుస్తుంది.

"""/" / ఎందుకంటే ఈ సినిమాలో విజయ్ ఇమేజ్ కి సరిపడా కథ లేదు.

ఇక అసలు కథలో పెద్దగా మ్యాటర్ అయితే ఏమీ లేదు.ఏదో పాత స్టోరీని తీసుకొచ్చి ఈ జనరేషన్ కి తగ్గట్టుగా చిన్న మార్పులు చేర్పులు చేసి చేసినట్టుగా అనిపించింది.

అంతే తప్ప పెద్దగా కొత్తదనం అయితే ఏమీ లేదు.కాబట్టి ఈ సినిమా బాక్సఫిస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.

ఇక ఇప్పుడు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ సినిమా చేసినందుకు విజయ్ మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడట.

"""/" / అయితే గీతగోవిందం ( Geetha Govindam)లాంటి సూపర్ సక్సెస్ కాంబినేషన్ కాబట్టి విజయ్ ఈ సినిమాని ఒకే చేశాడు కానీ లేకపోతే మాత్రం అసలు ఈ సినిమా చేసేవారు కాదేమో అంటూ మరి కొంతమంది వాళ్ల అభిప్రాయాలను అయితే తెలియజేస్తున్నారు.

ఇక మొత్తానికైతే విజయ్ ప్రస్తుతం వరుసగా మూడు సినిమాలతో సక్సెస్ లు కొట్టాలని చూస్తున్నాడు.

అందుకే ఈ మూడు సినిమాలే అతన్ని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మార్చే సినిమాలు అంటూ మరి కొంతమంది ఆయన అభిమానులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదిక గా తెలియజేస్తున్నారు.

గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటి మీరా.. భర్త ఎవరంటే?