ప్రమోషన్స్ తోనే ప్రేక్షకులకు మతులు పోగొడుతున్న చిన్న సినిమాలు

సినిమా ఎవ్వడైనా తీస్తాడు కానీ ప్రమోషన్ గట్టిగా చేసిన వాడే ఇప్పుడు ఇక్కడ రాజ్యం వెళుతున్నాడు.బాహుబలి సినిమా తీయడం గొప్పకాదు దానిని ప్రేక్షకుల వరకు తీసుకెళ్లడమే రాజమౌళి గొప్పతనం.

 Tollywood Small Movies And Their Promotions , Ashish Reddy , Love Me , Aay,-TeluguStop.com

ఇటీవల కాలంలో సినిమాలు తీయడం కన్నా కూడా వాటిని ప్రేక్షకులకు చేరవేయడానికి దర్శక నిర్మాతలు అనేక పాట్లు పడుతున్నారు.అసలే ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ఎవ్వరూ థియేటర్ వైపు వెళ్లడం లేదు.

ఓటిటిలో విడుదలైనప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటున్నారు లేదా ఐ బొమ్మ లాంటి వాటిపై ఆధారపడుతున్నారు.అందుకే ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్ కోసం కొంతమంది దర్శకులు చాలా కొత్తగా ట్రై చేస్తున్నారు.

Telugu Ashish Reddy, Brahmaanandam, Dil Raju, Love, Narne Nithin, Raja Goutham,

సినిమా తీయడం కన్నా కూడా ఈ ప్రమోషన్స్( Promotions ) చేయడంలోనే అసలు మజా ఉంటుంది అనేది దర్శకులు అభిప్రాయం.ఉదాహరణకు దిల్ రాజు తనయుడు మరియు వారసుడు అయిన ఆశిష్ రెడ్డి( Ashish Reddy ) మే 25న లవ్ మీ( Love Me ) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుండగా దీనికి సంబంధించిన ట్రైలర్ ని చాలా అందంగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా విడుదల చేసి అందులో సక్సెస్ అయ్యారు దిల్ రాజు.ఇక మేమేమీ తక్కువ తినలేదు అంటున్నారు గీత ఆర్ట్స్ వారు.

వారి బ్యానర్ లో వస్తున్న ఒక చిన్న చిత్రం ఆయ్.ఈ సినిమాకు అంజి దర్శకుడుగా ఉండగా, దీనికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా చాలా నూతనంగా ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు బన్నీ వాసు.

Telugu Ashish Reddy, Brahmaanandam, Dil Raju, Love, Narne Nithin, Raja Goutham,

ఫస్ట్ లుక్ నుంచి నటీనటుల పరిచయాలు చాలా విభిన్నంగా మరియు ఆకర్షణీయంగా విడుదల చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు దర్శకుడు.ఇక బ్రహ్మానందం కూడా ఈ వరుసలో ఉన్నాడు.ఇటీవల బ్రహ్మానందం( BrahmaAnandam ) మరియు అతని కొడుకు కలిసి ఒక సినిమాలో నటిస్తుండగా దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కోసం ఫన్నీగా ఒక వీడియో తయారు చేశారు తాత పాత్ర కోసం బ్రహ్మానందం ఎలా ఒప్పించారు అనే ఒక కాన్సెప్ట్ తో ఈ వీడియో రెడీ చేసి విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.ఇలా పెద్ద సినిమాలో కాదు కానీ చిన్న సినిమాలు అన్నీ కూడా ప్రమోషన్స్ కోసం ఎంతో అందమైన మరియు ఆకర్షణీయమైన వీడియోలతో ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube