వైరల్ వీడియో: సినిమా స్టైల్లో మహిళను రక్షించిన జాలర్లు..

సాధారణంగా కుటుంబం అన్నాక గొడవలు ఉండనే ఉంటాయి.ఆ గొడవలను పట్టించుకుని కొంతమంది మహిళలు తీసుకునే నిర్ణయాలకు కుటుంబం మొత్తం బలి అవుతున్న సందర్భాలు ఎన్నో చూస్తూనే ఉన్నాం.

 Woman Jumping Into Godavari River And Rescued By Fishermen Video Viral Details,-TeluguStop.com

కొద్దీపాటి ఆవేశంతో ప్రాణాలు తీసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి.చిన్న చిన్న కారణాలతోనే ఆత్మహత్యలు చేసుకోవడం, వారి పిల్లలను నడిరోడ్డుపై వదిలేసిన సందర్భాలు చాలానే చూస్తూ ఉంటాం.

అయితే తాజాగా ఒక వివాహిత కుటుంబ కలహాలతో గోదావరిలో( Godavari ) దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించగా చివరికి జాలర్ల సహాయంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి( Rajahmundry ) చెందిన ఒక వివాహిత కుటుంబ కలహాలతో( Family Disputes ) ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకొని రోడ్డు కం రైల్వే బ్రిడ్జి వద్ద గోదావరిలోకి దూకేసింది.ఇది గమనించిన కొంతమంది స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వగా.

, పోలీసులు అప్రమత్తమై అక్కడ ఉన్న జాలర్లను( Fishermen ) అలెర్ట్ చేసి పడవపై వేగంగా వెళ్లి రక్షించాలని సూచించారు.దీనితో వెంటనే ఆ జాలర్లు కూడా ఆ మహిళను రక్షించాలని గోదావరిలోకి వెళ్లి ఆ మహిళను సురక్షితంగా కాపాడారు.

అనంతరం ఆ మహిళను పోలీసులకు అప్పగించగా.పోలీసులు ఆ మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఇక ఇది ఇలా ఉండగా., మరోవైపు జాలర్లు సినిమా స్టైల్ లో మహిళను రక్షించిన తీరుపై నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.అంతేకాకుండా రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రత్నయ్య, కానిస్టేబుల్ లీలా కుమార్ పై హర్షం వ్యక్తం చేస్తూ… వారు వెంటనే స్పందించిన తీరుకు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.ప్రస్తుతం మహిళను జాలర్లు రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube