బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్( Prime Minister Rishi Sunak ) జూలై 4న ఎన్నికలను ఎదుర్కోనున్నారు.ఆయన పాలనకు , సమర్ధతకు ఈ ఎన్నికలు పరీక్ష పెడుతున్నాయి.
గెలిస్తే ఓకే లేదంటే గనుక ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి వారాంతంలో లండన్‌లోని ఐకానిక్ బీఏపీఎస్ శ్రీ స్వామి నారాయణ్ మందిర్‌లో ( Sri Swami Narayan Mandir )సునాక్, ఆయన సతీమణి అక్షతా మూర్తిలు శనివారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వర్తించారు.
టెంపుల్ కాంప్లెక్స్‌లో కలియతిరిగిన సునాక్ దంపతులు వాలంటీర్లు, సీనియర్ కమ్యూనిటీ నాయకులతో ముచ్చటించారు.స్వతహాగా క్రికెట్ అభిమాని అయిన రిషి సునాక్ టీ20 ప్రపంచకప్‌లో ( T20 World Cup )భారత్ విజయం సాధించడాన్ని ప్రస్తావిస్తూ టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు.
తాను హిందువునని.మీ అందరిలాగే తాను విశ్వాసం నుంచి ప్రేరణ , ఓదార్పు పొందుతానని రిషి సునాక్ పేర్కొన్నారు.
భగవద్గీతపై పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయడం గర్వంగా ఉందన్నారు.మన విశ్వాసం మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని బోధిస్తుందని, ఎవరైనా దానిని నమ్మకంగా చేసినంత కాలం ఫలితం గురించి చింతించాల్సిన పనిలేదని రిషి సునాక్ వ్యాఖ్యానించారు.నా తల్లిదండ్రుల నుంచి తాను నేర్చుకున్నానని, నా కుమార్తెలకు కూడా ఆ ధర్మాన్ని అందించాలనుకుంటున్నానని ప్రధాని తెలిపారు.
జనరల్ ప్రాక్టీషనర్ అయిన తన తండ్రి, ఫార్మాసిస్ట్ అయిన తన తల్లి , అత్తగారు సుధామూర్తి భారతదేశంలో చేస్తున్న సేవ గురించి రిషి సునాక్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.తన ప్రయాణంలో మీరు అడుగడుగునా తోడుగా ఉన్నారని.ఈ ఉద్యోగంలో కష్టతరమైన రోజుల్లో మీ మద్ధతు లభించిందని.
బ్రిటీష్ ఆసియా ప్రధానిగా గర్వంగా ఉందని ఆయన తెలిపారు.మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచకూడదని తాను నిర్ణయించుకున్నానని రిషి సునాక్ వెల్లడించారు.
యూకే ప్రధాని దంపతులు చివరిసారిగా గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన జీ20 సమావేశాల సందర్భంగా భారతదేశాన్ని సందర్శించినప్పుడు న్యూఢిల్లీలోని అక్షర్‌ధామ్ ఆలయంలో ప్రార్ధనలు చేశారు.