ధనుంజయ్ రెడ్డి ని వదిలేలా లేరే ? 

గత వైసిపి ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలు,  నిబంధనలు ఉల్లంఘన పై కొత్తగా ఏర్పడిన టిడిపి,  జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టింది.ఒక్కొక్కటిగా అప్పటి వ్యవహారాలను బయటపెట్టి అవినీతి వ్యవహారాలకు పాల్పడిన అధికారులు నాయకులను జైలుకు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ మేరకు అప్పటి ప్రభుత్వంలో చోటు చేసుకున్న నిబంధనాల ఉల్లంఘన పై పూర్తిగా దృష్టి సారించింది.

 Tdp Government Focussed On Anarchies Of Dhanunjaya Reddy Details, Tdp, Telugudes-TeluguStop.com

దీనిలో భాగంగానే వివిధ విభాగాలలో జరిగిన లోపాలు , నిధుల దుర్వినియోగంపై శ్వేత పత్రాలను విడుదల చేయడం మొదలుపెట్టింది.అప్పటి ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల వ్యవహారాలను ఇప్పుడు బయటకు లాగుతోంది.

Telugu Ap, Ap Sachivalayam, Jagan, Sakshi Paper, Telugudesham, Volunteers, Ys Bh

ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) వ్యవహారాలపై ఫిర్యాదులు చేయించి ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు ఇదే విధంగా గత వైసిపి ప్రభుత్వం గ్రామ వార్డు వాలంటీర్ సచివాలయ కార్యదర్శుల విభాగానికి ముఖ్యమంత్రి సలహాదారుగా పనిచేసిన ధనుంజయ రెడ్డి( Dhanunjaya Reddy ) పైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు.ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ధనుంజయ రెడ్డి జగన్ కుటుంబ సభ్యుల అండదండలతో భారీగా అక్రమాలకు పాల్పడ్డారనే ఫిర్యాదుల పైన విచారణ మొదలుపెట్టారు.ధనుంజయ రెడ్డి పలు శాఖల్లో జోక్యం చేసుకుని అధికారులపై పెత్తనం చేశారని , వైఎస్ భారతి( YS Bharati ) చైర్పర్సన్ గా ఉన్న సాక్షి దినపత్రికను లక్షల్లో వాలంటీర్లు, సచివాలయ కార్యదర్శులకు బలవంతంగా అంటగట్టారని , ఈ వ్యవహారంపై కోర్టుల్లో కూడా కేసులు నడిచాయి.

Telugu Ap, Ap Sachivalayam, Jagan, Sakshi Paper, Telugudesham, Volunteers, Ys Bh

భారతి మెప్పు పొందేందుకు,  ప్రభుత్వంలో తన పైరవీలు చేసుకునేందుకు ధనుంజయ రెడ్డి గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ నిధులతో వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులకు పేపర్ కొని విధానాన్ని ప్రవేశపెట్టారని , దీనిని అమలు చేసేందుకు అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేశారని దానిపైన ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.అనేక శాఖల్లో ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి పేరు వైఎస్ భారతి పేర్లు చెప్పి పైరవీలు చేసి కోట్ల రూపాయల లబ్ధి పొందినట్లుగా ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందడంతో,  వీటి పైన విచారణ చేసి అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube