అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్( President Donald Trump ) రెండోసారి బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా వాషింగ్టన్ డీసీలోని( Washington DC ) క్యాపిటల్ హిల్ రోటుండాలో అట్టహాసంగా ప్రమాణ స్వీకార వేడుక జరిగింది.
ట్రంప్ భార్య, అమెరికా ఫస్ట్ లేడీ మెలానియాతో( Melania Trump ) కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు.కార్యక్రమంలో మెలానియాతో కలిసి డ్యాన్స్ చేయడం, ఆ ఉత్సాహభరిత క్షణాలను ఆస్వాదించడం విశేషంగా నిలిచింది.
ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ దంపతులు కూడా ఈ వేడుకలో తమ నృత్యంతో అందరినీ ఆకట్టుకున్నారు.ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రశంసలు అందుకుంటున్నాయి.
ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా పలువురు అగ్రనేతలు, పారిశ్రామిక దిగ్గజాలు, టెక్ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు.గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్, అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.1861లో అబ్రహం లింకన్( Abraham Lincoln ) ప్రమాణ స్వీకారానికి ఉపయోగించిన చారిత్రక బైబిల్‌తో పాటు తన వ్యక్తిగత బైబిల్‌ను చేతిలో పట్టుకుని ట్రంప్ బాధ్యతలు స్వీకరించడం విశేషంగా నిలిచింది.
ప్రమాణ స్వీకార వేడుకకు ముందు, ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కూడా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.ఈ వేడుకకు హాజరైన వారు ట్రంప్ నూతన పాలనకు శుభాకాంక్షలు తెలియజేసి ఆయన నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ వేడుక అమెరికా దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది.
ఈ సందర్బంగా ట్రంప్ ప్రభుత్వం