వీడియో వైరల్.. అక్కడ భోజనం వండిన గౌతమ్ అదానీ

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా( Maha Kumbh Mela ) కార్యక్రమం భక్తుల సముదాయంతో భక్తి పరవశంగా మారింది.ఈ మహా సద్గురుతికి మంగళవారం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ,( Gautam Adani ) అదానీ ఫౌండేషన్ చైర్‌పర్సన్ ప్రీతి అదానీ( Preeti Adani ) హాజరయ్యారు.

 Gautam Adani Offers Seva At Iskcon Camp At Mahakumbh Mela In Prayagraj Video Vir-TeluguStop.com

ఈ సందర్భంగా వారు త్రివేణి సంగమంలో పూజలు నిర్వహించి, ఆధ్యాత్మికతతో నిండిన ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు.తమ ప్రయాణంలో అదానీ దంపతులు ఇస్కాన్( ISKCON ) క్యాంపును సందర్శించి, అక్కడ జరిగే మహాప్రసాద సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సేవా కార్యక్రమంలో మహాప్రసాదం తయారీలో సహాయపడటమే కాకుండా, భక్తులకు భోజనం అందించడంలో సహకరించారు.దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈ వినూత్న సేవా కార్యక్రమాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఈ సేవా కార్యక్రమంపై గౌతమ్ అదానీ మాట్లాడుతూ.“మహా కుంభమేళాకు రావడం, ఇస్కాన్ మహాప్రసాద సేవలో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉంది.లక్షలాది మంది భక్తులకు ఉచితంగా ఆహారం అందించడం గొప్ప కార్యక్రమం.ఇస్కాన్‌ నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా” అని ఆయన అన్నారు.ఇస్కాన్ వారు మహా కుంభమేళా సందర్భంగా 50 లక్షల మంది భక్తులకు ఉచితంగా భోజనం అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇందుకోసం రెండు పెద్ద వంటశాలల్లో భోజనం తయారు చేసి, మేళా ప్రాంగణంలోని 40 ప్రాంతాలలో భక్తులకు ఆహారాన్ని అందిస్తున్నారు.

రోజుకు సుమారు లక్ష మందికి భోజనం అందించే ఈ కార్యక్రమం భక్తుల హృదయాలను తాకుతోంది.అంతేకాకుండా, ఇస్కాన్‌ వాలంటీర్లు ఐదు లక్షల గీతా కాపీలను భక్తులకు పంపిణీ చేస్తూ ఆధ్యాత్మిక సందేశాలను విస్తరిస్తున్నారు.

ఇకపోతే ఈ మహా కుంభమేళా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవంగా పేరుపొందింది.ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్న ఈ మహోత్సవానికి సుమారు 40 కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు అధికారులు.కుంభమేళా ప్రారంభమైన మొదటి రోజే కోటి మందికి పైగా భక్తులు పవిత్ర స్నానం చేసి తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించారు.ఈ మహా కుంభమేళా భక్తుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తూనే, సాంస్కృతిక విలువలను ప్రపంచానికి చాటిచెప్పేలా ఉంది.

అదానీ దంపతుల పర్యటన, ఇస్కాన్ మహాప్రసాద సేవలో వారి భాగస్వామ్యం భక్తి, సేవాతత్వానికి చిరునామాగా నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube