మెంతులు( fenugreek ).వీటి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.
దాదాపు ప్రతి ఒక్కరి వంటింట్లో మెంతులు ఉంటాయి.వంటల్లో మెంతులను విరివిరిగా వాడుతుంటారు.
రుచి చేదుగా ఉన్నా మెంతుల్లో అనేక పోషకాలు నిండి ఉంటాయి.కొందరు వెయిట్ లాస్ అవ్వడం కోసం మెంతులను నైట్ అంతా వాటర్ లో నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటారు.
అయితే మొలకెత్తిన మెంతులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.అసలు వీటి లాభాలు తెలిస్తే తినకుండా ఉండలేరు.
సాధారణ మెంతులతో పోలిస్తే మొలకెత్తిన మెంతుల్లో పోషకాలు రెట్టింపుగా ఉంటాయి.రోజుకు ఒకటి లేదా రెండు స్పూన్లు మొలకెత్తిన మెంతులను( Sprouted fenugreek ) తీసుకుంటే మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి.
ముఖ్యంగా మధుమేహం వ్యాధి ( Diabetes )గ్రస్తులకు మొలకెత్తిన మెంతులు ఒక వారం అని చెప్పవచ్చు.నిత్యం మొలకెత్తిన మెంతులను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
అలాగే మొలకెత్తిన మెంతులు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి.మోకాళ్ళ నొప్పులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.
ఒకవేళ మోకాళ్ళ నొప్పులు( Knee pain ) ఉంటే వాటి నుంచి విముక్తి లభిస్తుంది.
మొలకెత్తిన మెంతులను నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు క్యాలరీలు సూపర్ ఫాస్ట్ గా కరుగుతాయి.దాంతో వెయిట్ లాస్ అవుతారు.పొట్ట కొవ్వు కొద్ది రోజుల్లోనే మాయం అవుతుంది.
అంతేకాదండోయ్ మొలకెత్తిన మెంతులను తింటే గుండె ఆరోగ్యంగా మారుతుంది.క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.
స్త్రీలలో నెలసరి సమస్యలు దూరం అవుతాయి.
మొలకెత్తిన మెంతుల్లో పొటాషియం మెండుగా ఉంటుంది.అది మన హైపర్ టెన్షన్ ను కంట్రోల్ చేస్తుంది.మొలకెత్తిన మెంతుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు( Antioxidants ) మన రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.
అనేక జబ్బులు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకుంటాయి.మొలకెత్తిన మెంతులు నిత్యం తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.
మరియు చర్మం ఆరోగ్యంగా యవ్వనంగా మెరుస్తుంది.కాబట్టి మొలకెత్తిన మెంతులను తప్పకుండా డైట్ లో చేర్చుకోండి.
నేరుగా తినలేము అనుకునేవారు సలాడ్స్ లో కలిపి తీసుకుంటే మంచిది.