నా లైఫ్ లో అత్యంత భయానక క్షణాలివే.. మాధవన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్, కోలీవుడ్, ఇతర ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో మాధవన్( Madhavan ) ఒకరు కాగా ఈ నటుడికి ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది.తన సినీ కెరీర్ గురించి మాధవన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడగా ఆయన చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

 Madhavan Sensational Comments About His Life Details, Madhavan, Actor Madhavan,-TeluguStop.com

మరికొన్ని గంటల్లో నా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందంటే నేను భయాందోళనకు లోనవుతానని ఆయన అన్నారు.

నిజం చెప్పాలంటే నా కెరీర్ లో రెండే క్షణాలు నరాలు తెగేంత ఉత్కంఠను కలిగిస్తాయని సినిమా షూటింగ్ లో మొదటి రోజు భయం వేస్తుందని అలాగే సినిమా రిలీజ్ మొదటి రోజు కూడా ఆందోళనగానే ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

సినిమా రిలీజ్ రోజున ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు బయటకు వస్తాయని సినిమా ఆశించిన స్థాయిలో లేని పక్షంలో గేమ్ ఓవర్ అని కామెంట్ చేస్తారేమో అని నేను భయపడతానని ఆయన తెలిపారు.

Telugu Madhavan, Hisaab Barabar, Kollywood, Madhavanhisaab-Movie

సినిమా ఇండస్ట్రీలో 25 ఏళ్లుగా కెరీర్ ను కొనసాగించడం సులువైన విషయం కాదని మాధవన్ తెలిపారు.కొంతమంది హీరోలు 25 నెలల్లోనే అవకాశాలు కోల్పోతారని ఈ విషయంలో నేను చాలా లక్కీ అని మాధవన్ అన్నారు.నన్ను ఎంతోమంది ప్రేక్షకులు ఇప్పటికీ ఆదరిస్తున్నారని మాధవన్ కామెంట్లు చేశారు.

వాళ్లందరికీ కృతజ్ఞతలు అని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Madhavan, Hisaab Barabar, Kollywood, Madhavanhisaab-Movie

హిసాబ్ బరాబర్ సినిమాను( Hisaab Barabar Movie ) ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామని ఈ ప్రాజెక్ట్ ను అందరూ హిట్ చేస్తారనే నమ్మకం ఉందని మాధవన్ వెల్లడించారు.జనవరి నెల 24వ తేదీ నుంచి ఈ ప్రాజెక్ట్ ఓటీటీలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.ఈ ప్రాజెక్ట్ లో నిజాయితీ గల అధికారి పాత్రలో మాధవన్ కనిపించనున్నారు.

మాధవన్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube