రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్ది పేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల కిషన్ దాస్ పేట లో గల మండల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో విద్యార్థుల ఫొటోలతో కూడిన క్యాలెండర్ ను మండల విద్యాధికారి కృష్ణహరి,మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ల చేతుల మీదుగా పాఠశాల ఆవరణలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.కార్యక్రమం కు హాజరైన ముఖ్య అతిథులుగా హాజరైన మండల విద్యాధికారి మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజ్ యాదవ్ లు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల కు దీటుగా విద్యార్థుల పేరిట వారి ఫోటోలతో సహా నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించుకోవ డం శుభపరిణామామని వారు అన్నారు.
ఈ సందర్భంగా కార్పొరేట్ పాఠశాలల కు ధీటుగా పాఠశాల లో వినూత్న కార్యక్రమాలు చేయడం అభినందనీయం అని కొనియాడారు.పారశాలలో 108 మంది విద్యార్థులు చదువుతున్నారని ఈ సంఖ్య ను మరింత పెంచితే మరో ఉపాధ్యాయ పోస్ట్ మంజూరు అవుతుందని వారు అన్నారు.
గత ఏడాది ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు పంపరి రజిత ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయని 26 వ గణ తంత్ర దినోత్సవ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించాలని మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజ్ యాదవ్ ఉపాధ్యాయ సిబ్బంది కి సూచించారు.మాజీ ఎంపీటీసీ సభ్యులు ఒగ్గు బాలరాజు యాదవ్ పాల్గొని పాఠశాల సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు భట్టారి సంపత్ కుమార్, ఉపాధ్యాయులు తుమ్మనపల్లి నరేష్,పంపరి రజిత, మిట్టపెల్లి ప్రశాంత్ కుమార్, విద్యార్థుల తల్లులు నాగలక్ష్మి,విద్యా వాలంటీర్ లు పాల్గొన్నారు.