టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జునకు( Nagarjuna ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.ఈ మధ్య కాలంలో నాగార్జున సరైన సక్సెస్ లేకపోవడం వల్ల కెరీర్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
గత కొన్నేళ్ల వరకు భారీ విజయాలు అందుకున్న నాగార్జున తన సినీ కెరీర్ లో మిస్ చేసుకున్న సినిమాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.కలిసుందాంరా,( Kalisundam Raa ) మెకానిక్ అల్లుడు,( Mechanic Alludu ) బద్రి, మౌనరాగం, మణిరత్నం ఘర్షణ సినిమాలను నాగ్ వదులుకున్నారని సమాచారం అందుతోంది.
నాగార్జున ఈ సినిమాల్లో నటించి ఉంటే మాత్రం ఈ హీరో కెరీర్ మరింత పుంజుకునేదని చెప్పవచ్చు.నాగార్జున బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.
కుబేర,( Kubera ) కూలీ( Coolie ) సినిమాలు నాగార్జునకు భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.
నాగార్జున నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మాత్రం కెరీర్ పరంగా తిరుగుండదని చెప్పవచ్చు.నాగార్జునకు గతేడాది నా సామిరంగ సినిమా భారీ సక్సెస్ ను అందించింది.నాగార్జున ఇతర భాషల్లో అవకాశాలు వస్తుండగా ఆ ఆఫర్లకు కూడా వెంటనే ఓకే చెబుతున్నారు.నాగార్జున రెమ్యునరేషన్ ప్రస్తుతం 20 కోట్ల రూపాయల నుంచి 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.
కుబేర సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.నాగార్జున వయస్సు పెరుగుతున్నా అదిరిపోయే లుక్స్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.కూలీ సినిమాకు లోకేశ్ కనగరాజ్ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే.నాగార్జున కెరీర్ విషయంలో పొరపాట్లు చేయవద్దని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.నాగార్జున ఫ్యామిలీ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలలో నటించాలని నెటిజన్లు కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.