భారత్, ఇంగ్లాండ్( India, England ) మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్( T20 series ) జనవరి 22న ప్రారంభం కానుంది.ఈ సిరీస్ కోసం భారత జట్టులో రింకు సింగ్‌కు చోటు దక్కింది.
ఇటీవల రింకు సింగ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ వీడియోలో రింకు డబ్బు పంచుతూ కనిపించాడు.
రింకు సింగ్ ( Rinku Singh )తన స్వస్థలమైన అలీఘర్‌లో కొత్త ఇల్లు కట్టించాడు.ఈ ఇల్లు గృహప్రవేశ వేడుకను ఎంతో ఆడంబరంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రింకు డబ్బు పంపిణీ చేశాడని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అయితే, రింకు ఈ డబ్బును చెఫ్స్, ఇతర పనివారికి పంచాడని సమాచారం.ఈ వీడియోలను చాలా మంది అభిమానులు సోషల్ మీడియాలో చేస్తూ రింకు సింగ్ ఉదారతను ప్రశంసిస్తున్నారు.ఈ ఘటనపై రింకు నుంచి ఇంకా ఎటువంటి అధికారిక స్పందన రాలేదు.
జనవరి 22న కోల్‌కతాలో మొదటి మ్యాచ్‌తో ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో, జనవరి 25న చెన్నైలో రెండో మ్యాచ్, జనవరి 28న రాజ్‌కోట్‌లో మూడో మ్యాచ్,( Third match at Rajkot ) జనవరి 31న పూణేలో నాలుగో మ్యాచ్, ఫిబ్రవరి 2న ముంబైలో చివరి మ్యాచ్ జరగనుంది.
రింకు సింగ్ ఇప్పటి వరకు భారత్ తరపున 2 వన్డేలు, 30 టీ20లు ఆడాడు.టీ20ల్లో 507 పరుగులు సాధించిన రింకు మూడు అర్ధసెంచరీలు చేశాడు.అలాగే, ఐపీఎల్‌లో 45 మ్యాచ్‌ల్లో 893 పరుగులు చేసి నాలుగు అర్ధసెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు.రింకు తన ఆటతీరుతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ తన అద్భుతమైన చర్యలతో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు అలీఘర్‌లో జరిగిన గృహప్రవేశ వేడుకలో డబ్బు పంపిణీ చేస్తూ, తన ఉదారతను చాటుకున్న రింకు అభిమానుల గుండెల్లో మరింత చెరగని ముద్ర వేసుకున్నాడు.మరికొందరైతే రింకు చేసిన పనిని మాత్రం వ్యతిరేకిస్తున్నారు.