అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ తారాస్థాయికి చేరుకుంది.డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీల( Democratic , Republican parties ) అభ్యర్ధులు అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల( Donald Trump ) మధ్య జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ వాడివేడిగా సాగింది.
ఈ చర్చలో ట్రంప్-బైడెన్‌లు ఒకరిపై ఒకరు విమర్శలు , ఆరోపణలు చేసుకున్నారు.మరి ఇద్దరిలో ఎవరు బెస్ట్ , ఎవరు తమ విధానాలతో ప్రజలను మెప్పించారు అనే దానిపై అమెరికాలో పలు సంస్థలు సర్వేలు నిర్వహించాయి.
సీబీఎస్ న్యూస్ – యూగోవ్ సర్వే ప్రకారం.తొలి చర్చా కార్యక్రమం తర్వాత 72 శాతం మంది బైడెన్ మరోసారి అధ్యక్షుడిగా పనిచేయడానికి ఇష్టపడటం లేదు.కానీ ట్రంప్‌పై 50 శాతం మంది మాత్రమే నమ్మకం ఉంచారు.1,130 మంది ఓటర్లు ఈ సర్వేలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఫిబ్రవరిలో అధ్యక్ష పదవికి పోటీ చేయాలని బైడెన్‌కు ( Biden )37 శాతం మంది ఓటు వేయగా ఇప్పుడు ఆయన పరిస్ధితి భయంకరంగా ఉంది.నమోదిత ఓటర్లలో ప్రతి నలుగురిలో ముగ్గురు (72 శాతం మంది ) ఇకపై బైడెన్ పోటీ చేయకూడదని అభిప్రాయపడుతున్నారు.
అతని వయసుపై ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు అతని ప్రచారంపై ఓటర్లు దృష్టి సారించారు.ట్రంప్‌తో డిబేట్ తర్వాత బైడెన్‌కు మద్ధతు ఇచ్చే వారి సంఖ్య కూడా తగ్గినట్లుగా కనిపిస్తోంది.
64 శాతం మంది నమోదిత డెమొక్రాటిక్ ఓటర్లు ఫిబ్రవరిలో బైడెన్ అధ్యక్ష బరిలో నిలవాలని కోరగా.డిబేట్ తర్వాత ఆ సంఖ్య 54 శాతానికి పడిపోయింది.
బైడెన్ ఎందుకు పోటీ చేయకూడదు అని అడిగినప్పుడు .నమోదిత ఓటర్లు ఇచ్చిన సమాధానాలలో అతని వయస్సును 86 శాతం మంది, వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడాన్ని 71 శాతం మంది, ప్రచార సామర్ధ్యాన్ని 66 శాతం మంది ప్రస్తావించారు.
ట్రంప్‌కు మాత్రం రిపబ్లికన్లలో మద్ధతు పెరుగుతోంది.డిబేట్‌లో తన ఆలోచనలను స్పష్టంగా ప్రదర్శించారని, మరింత విశ్వాసాన్ని వ్యక్తం చేశారని.బైడెన్‌తో పోలిస్తే అధ్యక్షుడిగా కనిపించారని ఓటర్లు పేర్కొన్నారు.47 శాతం మంది ఓటర్లు ట్రంప్ తన ఆలోచనలను స్పష్టంగా ప్రెజెంట్ చేశారని చెప్పారు.ఈ విషయంలో బైడెన్‌కు 21 శాతం మంది మాత్రమే జై కొట్టారు.అలాగే 46 శాతం మంది ట్రంప్ అధ్యక్షుడిగా కనిపిస్తున్నారని అంటే బైడెన్‌ను 28 శాతం మంది ఎంచుకున్నారు.43 శాతం మంది ఓటర్లు ట్రంప్ తన ప్రణాళికలు, విధానాలను మెరుగ్గా వివరించారని చెప్పగా.బైడెన్‌కు 35 శాతం మంది మాత్రమే మద్ధతుగా నిలిచారు.
అయితే ట్రంప్‌తో పోలిస్తే నిజాయితీ విషయంలో బైడెన్‌కు ఎక్కువ మార్కులు పడ్డాయి.బైడెన్ నిజం చెబుతున్నారని 40 శాతం మంది విశ్వసించగా.ట్రంప్ 32 శాతం మంది అండగా నిలిచారు.మరీ ముఖ్యంగా 48 శాతం మంది ఓటర్లు బైడెన్ గెలిస్తే దేశంలో ప్రజాస్వామ్యం, చట్టం సురక్షితంగా ఉంటాయని చెప్పగా.
ట్రంప్‌కు 47 శాతం మంది ఓటేశారు.ఆశ్చర్యకరంగా తొలిప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత 45 శాతం మంది డెమొక్రాటిక్ ఓటర్లు బైడెన్ ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకుని మరొకరికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేయడం గమనార్హం.
నెలక్రితం ప్రజాసేవ చేయడానికి అతని మానసిక ఆరోగ్యం బాగుందని 71 శాతం మంది అభిప్రాయపడగా.చర్చ తర్వాత అది 59 శాతానికి పడిపోయింది.