పైనాపిల్. దీని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.
తెలుగులో అనాస పండు అని పిలుచుకునే పైనాపిల్స్ మార్కెట్‌లో విరి విరిగా లభ్యమవుతున్నాయి.కాస్త పుల్లగా, కాస్త తియ్యగా ఉండే ఈ పైనాపిల్స్‌ను కొందరు ఎంతో ఇష్టంగా తింటుంటే.
మరికొందరు వీటిని అస్సలు దగ్గరకు కూడా రానివ్వరు.రుచి విషయం పక్కన పెడితే.
పైనాపిల్‌లో బోలెడన్ని పోషకాలు నిండి ఉన్నాయి.విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ ఎ, మెగ్నీషియం, పొటాషియం, జింక్, మాంగనీస్, కాల్షియం, ఐరన్, సోడియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక పోషకాలు ఉండే పైనాపిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
అందులోనూ పరగడుపున పైనాపిల్ వాటర్ తాగితే.మరిన్ని బెనిఫిట్స్ పొందొచ్చు.పైనాపిల్ వాటర్ ప్రిపేర్ చేయడం కూడా చాలా సులువు.ముందుగా పైనాపిల్ తొక్క తీసి.
చిన్న ముక్కలుగా కట్ చేసి క్రష్ చేసుకోవాలి.ఇలా క్రష్ చేసుకున్న పైనాపిల్ ముక్కలను ఒక గ్లాసు చల్లటినీటిలో కలపి.
పరగడుపునే తీసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే.
వెయిట్ లాస్ అవ్వొచ్చు.కాబట్టి, అధిక బరువు ఉన్న వారు పైనాపిల్ వాటర్ తీసుకుంటే మంచిది.అలాగే పరగడుపున పైనాపిల్ వాటర్ తీసుకుంటే.శరీర రోగ నిరోధక శక్తి బలపడుతుంది.
ఫలితంగా.జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వంటి జబ్బులు సరి చేరకుండా ఉంటాయి. కంటి చూపు లోపిస్తున్న వారు ప్రతి రోజు ఉదయానే పైనాపిల్ వాటర్ తీసుకుంటే.అందులో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
అలాగే రెగ్యులర్‌గా పైనాపిల్ వాటర్ తీసుకుంటే.గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు దూరం అవ్వడంతో పాటు జీర్ణ వ్యవస్థ కూడా మెరుగు పడుతుంది.
ఇక క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి దరి చేరకుండా చేయడంలోనూ పైనాపిల్ వాటర్ గ్రేట్‌గా సహాయపడుతుంది.కాబట్టి, ప్రతి ఒక్కరూ పైనాపిల్ వాటర్ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
అలాగే కీళ్ళ నొప్పులు ఉన్న వారు పైనాపిల్ వాటర్ తాగితే.అందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నొప్పి నివారిణిగా పని చేస్తాయి.