డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమా( Jayam Movie ) మీ అందరికీ గుర్తుండే ఉంటుంది.ఈ సినిమాలో హీరోగా నితిన్( Nithin ) హీరోయిన్ గా సదా నటించగా వారి చిన్న నాటి పాత్రల్లో చేసిన చైల్డ్ ఆర్టిస్టులు కూడా చాలా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇక హీరోయిన్ చిన్ననాటి పాత్ర పోషించిన చైల్డ్ ఆర్టిస్ట్ యామిని( Child Artist Yamini ) ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో బాగా సెటిల్ అయిపోయింది.అయితే ఈమె ఆర్టిస్ట్ జయలక్ష్మి కూతురు కావడంతో అందరికి బాగానే పరిచయం.
గోపీచంద్ చిన్ననాటి పాత్ర పోషించిన అబ్బాయి గురించి అందరూ సోషల్ మీడియాలో హీరో నిఖిల్( Hero Nikhil ) అని అనుకుంటున్నారు.కానీ హీరో నిఖిల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈ చిత్రంలో నటించలేదు.
ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు దిలీప్ కుమార్.( Dilip Kumar )
నెంబర్ వన్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమయ్యాడు దిలీప్.చిన్నతనం లో 30కి పైగా సినిమాలు మరియు సీరియల్స్ లో నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు.కానీ జయం సినిమాలో చాలా అగ్రెషన్ ఉన్న గోపీచంద్ పాత్రలో( Gopichand Role ) నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు.అయితే ఆ తర్వాత హీరోగా నిలదొక్కు కోవాలని ప్రయత్నాలు చేసినప్పటికి అవేమీ ఫలించలేదు.2019లో ఒకే ఒక్క సినిమా దిక్సూచి లో( Diksoochi ) హీరోగా నటించిన అది పెద్దగా క్లిక్ అవ్వలేదు దాంతో ఆయన నటుడిగా ప్రయత్నాలు మానేశారు ఇక 2022లో ఒక డాక్టర్ ను పెళ్లి చేసుకుని సెటిలైపోయాడు దిలీప్ కుమార్.
చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోలుగా ప్రయత్నాలు చేసి కనుమరుగైపోతున్న వారే అందులో దిలీప్ కుమార్ సలవాడి కూడా ఒకరు.ఎంతో మంచి టాలెంట్ ఉన్నప్పటికీ నటుడుగా మాత్రం సక్సెస్ అవ్వలేకపోయాడు.ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకపోతే ఏమీ సాధించలేము అని చెప్పడానికి దిలీప్ కుమార్ కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.ప్రస్తుతం దిలీప్ కుమార్ హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ తన పని చేసుకుంటూ పోతున్నాడు.
సినిమా ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉన్నాడు.కానీ ఏదో ఒక ఛాన్స్ వస్తే తాను కూడా నటుడుగా ప్రూవ్ చేసుకునే సత్తా ఉన్న నటుడు దిలీప్ కుమార్.