హెజ్‌బొల్లా అధినేత హసన్ నస్రల్లాను( Hezbollah Chief Hassan Nasrallah ) ఇజ్రాయెల్ మట్టుబెట్టడంతో పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది.లెబనాన్‌లోని దాహియాలో దాదాపు 60 అడుగుల లోతులో భూ గృహంలో ఉన్న నస్రల్లాను అత్యాధునిక యుద్ధ విమానాలు, బాంబులను వినియోగించి ఇజ్రాయెల్( Israel ) హతమార్చింది.
ఈ పరిణామాలతో హెజ్‌బొల్లా రగిలిపోతోంది.దెబ్బకు దెబ్బ తీస్తామని వార్నింగ్ ఇస్తోంది.
ఈ ఉగ్రమూకకి ఇరాన్, హూతీలు మద్ధతుగా నిలుస్తున్నారు.ఈ ఘర్షణలు ప్రాంతీయ యుద్ధానికి దారి తీస్తాయమోనని ప్రపంచం భయపడుతోంది.
హెజ్‌బొల్లాను తుడిచిపెట్టేయాలనే ఉద్దేశంతో లెబనాన్ రాజధాని బీరూట్‌లోని పౌర ప్రాంతాలపై ఇజ్రాయెల్ విస్తృతంగా వైమానిక దాడులు నిర్వహిస్తోంది.ఈ ఘటనల్లో సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.

కాగా.పలువురు దేశాధినేతలు, ప్రముఖులు నస్రల్లా మృతిపై స్పందిస్తున్నారు.తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు , ఇవాంక భర్త జారెడ్ కుష్నర్ .( Jared Kushner ) ఈ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను ఇజ్రాయెల్‌ను ప్రశంసించారు.గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి ఎట్టిపరిస్ధితుల్లోనూ అంగీకరించొద్దని.హెజ్‌బొల్లాను నాశనం చేయడానికి ఇజ్రాయెల్‌కు మరోసారి అవకాశం దొరకదని ఆయన వ్యాఖ్యానించారు.హెజ్‌బొల్లాను అధ్యయనం చేయడానికి తన జీవితంలో లెక్కలేనన్ని గంటలు గడిపానని కుష్నర్ గుర్తుచేసుకున్నారు.ఇరాన్( Iran ) నిజస్వరూపం ఇప్పుడు పూర్తిగా బయటపడిందని ఆయన చెప్పారు.

మరోవైపు ఇజ్రాయెల్ భద్రతకు ముప్పుగా మారిన ఒక్కొక్కరిని ఏరిపారేస్తున్న నెతన్యాహూ.( Netanyahu ) హమాస్ అధినేత యాహ్యా సిన్వార్‌పై ఫోకస్ పెట్టారు.బందీలను సిన్వార్ మానవ కవచాలుగా వాడుకుంటున్నాడని, అతనిని టార్గెట్ చేస్తే అమాయకుల ప్రాణాలకు ముప్పుగా మారుతుందని ఐడీఎఫ్ వెనకడుగు వేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.హెజ్‌బొల్లా అధినేత నస్రల్లా హత్య తర్వాత సిన్వార్ గాజాలోని సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
అయితే ఇజ్రాయెల్ దూకుడు చూస్తుంటే హమాస్ అధినేతను రేపో మాపో పైకి పంపే వరకు వదిలేలా కనిపించడం లేదు.