సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు సక్సెస్ కోసం చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు.ఇక కొంతమంది అయితే వరుస సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటారు.
మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఎందుకు సక్సెస్ ల వెనుక పరిగెడుతున్నారు అనే డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంటుంది.ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే సక్సెస్ లను బట్టే ఇక్కడ మార్కెట్ అనేది క్రియేట్ అవుతుంది.
ఆ మార్కెట్ ను బట్టే వాళ్ల రెమ్యూనరేషన్ బేస్ ఉంటుందనే ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు సక్సెస్ ఫుల్ సినిమాలకే ఎక్కువగా ఓటు వేస్తూ ఉంటారు.ఇక ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలు వస్తూ ఉంటాయి.ఇప్పుడున్న జనరేషన్ లో మంచి సినిమాలు చేస్తేనే సినిమా ఇండస్ట్రీలో అందరికీ మంచి అవకాశాలైతే వస్తాయి.లేకపోతే మాత్రం అందరూ తట్టా బుట్టా సర్దుకుని ఇంటికి వెళ్లి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఇక వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తే క్రేజ్ ఎక్కువగా పెరగడమే కాకుండా ప్రేక్షకులు ఆ సినిమాకి పెద్దపీట వేస్తున్నారు.
కాబట్టి ఎలాగైనా సరే సక్సెస్ ఫుల్ సినిమా చేయాలంటే ఒక వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రతి ఒక్క యంగ్ డైరెక్టర్ ఆలోచించి దానికి అనుగుణంగానే సినిమాలను తీసే ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అనేది అంత ఈజీ అయితే కాదు.సక్సెస్ ఫుల్ సినిమాలను చేస్తూ ముందుకు కదలాలి.
ఇక ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ, వివేక్ ఆత్రేయ( Nag Ashwin, Prashant Verma, Vivek Atreya ) లాంటి దర్శకులు స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు తెచ్చుకుని ముందుకు సాగుతున్నారు… ఇక మరి కొంతమంది కొత్త దర్శకులు కూడా ఇదే బాట లో నడుస్తున్నారు.చూడాలి మరి వీళ్ళు ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది…
.