మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో నిత్య పూజలకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది.దేవుడికి పూజ సమయంలో నైవేద్యంగా పండు లేదా ఫలహారం పెట్టి పూజించడం వల్ల అనేక సమస్యల నుంచి విముక్తి పొందుతారు అనేది మన నమ్మకం.
నైవేద్యంగా పెట్టిన వాటిని ప్రసాదంగా ఇంటిల్లిపాది స్వీకరించడం వల్ల ఎన్నో ఫలితాలు కలుగుతాయి.
అయితే ఒక్కో పండు నైవేద్యంగా సమర్పించి, దాని ప్రసాదంలాగా స్వీకరించడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు.
ఇక దేవునికి నైవేద్యంగా జామపండు సమర్పిస్తే షుగర్ వ్యాధి మాయమవుతుంది.అంతేకాకుండా జామపండు నైవేద్యంగా సమర్పించడం వల్ల ఎలాంటి శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయో ఇక్కడ తెలుసుకుందాం…
జామపండు అమ్మవారి ఆలయాలలో నైవేద్యంగా సమర్పించి, దానిని ప్రసాదంగా, ముత్తయిదువులు స్వీకరించినప్పుడు వారికి దీర్ఘసుమంగళీ ప్రాప్తం కలుగుతుంది.
అంతేకాకుండా మధుమేహ వ్యాధితో బాధపడేవారు, అమ్మవారి ఆలయాలలో నైవేద్యంగా సమర్పించిన జామపండ్లను, తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి తగ్గుతుంది.
పిల్లల కోసం, ఎదురుచూసేవారు ఈ పండు అమ్మవారి దగ్గర నుంచి ప్రసాదంగా తీసుకోవడం ద్వారా వారికి తొందరగా సంతాన ప్రాప్తి కలుగుతుంది.
ప్రథమ పూజ్యుడైనటువంటి ఆ విఘ్నేశ్వరునికి జామపండ్లను నైవేద్యంగా సమర్పించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
కడుపులో మంట, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
సంకష్టహర వినాయకుడికి నైవేద్యంగా సమర్పించిన జామపండును, తాంబూలంలో పెట్టి బ్రాహ్మణులకు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా, అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందటమే కాకుండా, మన శరీరం ఎంతో ఉత్సాహంగా, చురుకుగా ఉంటుంది.
కొంతమంది అవివాహితులకు ఎన్ని సంబంధాలు వచ్చినప్పటికీ వారికి వివాహం కుదరదు.
అలాంటి వారు ఏదైనా దేవాలయంలో స్వామి వారికి జామపండును, నైవేద్యంగా సమర్పించడం వల్ల వారికి తొందరగా వివాహం జరిగే సూచనలున్నాయి.దేవుడి అభిషేకంలో జామపండ్ల రసాన్ని వాడడం ద్వారా, మనం చేపట్టిన పనులలో ఎటువంటి ఆటంకం కలగకుండా, ఆ పనులు తొందరగా పూర్తి అవుతాయి.
జామపండును దేవాలయంలోనే కాకుండా, మన నిత్యం పూజ చేసే దేవుడి గదిలో కూడా నైవేద్యంగా సమర్పించి, దానిని ప్రసాదంగా ఇంటిల్లిపాది తీసుకోవడం ద్వారా ఆ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం చోటు చేసుకుంటుంది.