ఐఆర్‌సీటీసీ టూరిజం( IRCTC Tourism ) మరిన్ని రూట్స్ లో భారత్ గౌరవ టూరిస్ట్ రైళ్లను ప్రకటిస్తూ ఉంది.ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో కాశీకి టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసింది.
దీంతో పాటు మాతా వైష్ణో దేవికి మరో ట్రైన్ నడుపుతుంది.ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి భారత్ గౌరవ టూరిస్ట్ రైలులో మరో టూర్ ప్యాకేజీ ప్రకటించింది.
దివ్యదక్షిణ యాత్ర( Divya Dakshin Yatra ) పేరుతో టూర్ ప్యాకేజీనీ ప్రకటించింది.ఆగస్టు 9,23 సెప్టెంబర్ ఐదు తేదీలలో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
మరి ఈ టూర్ ప్యాకేజీ ఎలా సాగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఆర్‌సీటీసీ దివ్యదక్షిణ యాత్ర ఎనిమిది రాత్రులు, తొమ్మిది రోజుల టూర్ ప్యాకేజీ ఉంటుంది.సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటలలో పర్యాటకులు ఈ టూరిస్ట్ రైలు ఎక్కవచ్చు.మొత్తం 716 బెర్తులు అందుబాటులో ఉంటాయి.
స్లీపర్ బెర్త్‌లు 460, థర్డ్ ఏసి బెర్త్‌లు 260, సెకండ్ ఏసీ బెర్త్‌లు 50 అందుబాటులో ఉన్నాయి.ఐఆర్‌సీటీసీ దివ్యదక్షిణ యాత్ర మొదటి రోజు సికింద్రాబాద్లో మొదలవుతుంది.
రెండో రోజు ఉదయం 9 గంటలకు తిరువన్నమలై చేరుకుంటారు.తర్వాత అరుణాచల దేవాలయ దర్శనం ఉంటుంది.
దర్శనం తర్వాత మన్మధురై బయల్దేరాలి.మూడో రోజు మన్మధురై చేరుకున్న తర్వాత రామేశ్వరం( Rameswaram ) రోడ్డు మార్గంలో తీసుకెళ్తారు.స్థానిక దేవాలయాలను దర్శించుకోవచ్చు.రాత్రికి రామేశ్వరంలో బస చేయాలి.నాలుగో రోజు రామేశ్వరం నుంచి మధురై బయలుదేరాలి.సాయంత్రం మధురైలో మీనాక్షి అమ్మవారి దేవాలయ దర్శనం ఉంటుంది.
ఆ తర్వాత కన్యాకుమారి బయలుదేరుతారు.కన్యాకుమారిలో రాక్ మెమోరియల్, గాంధీ మండప్, సన్ సెట్ పాయింట్ చూడవచ్చు.
రాత్రికి కన్యాకుమారిలో బస చేయాలి.ఆరో రోజు త్రివేండ్రం బయలుదేరాలి.
శ్రీ పద్మనాభ స్వామి దేవాలయం, కోవలం బీచ్ ను చూసిన తర్వాత తిరుచ్చిరా పల్లి బయలుదేరాలి.
ఏడో రోజు శ్రీరంగం దేవాలయం దర్శనం ఉంటుంది.
ఆ తర్వాత తంజావూర్( Thanjavur ) లో బృహదీశ్వర దేవాలయ దర్శనం తర్వాత తిరుగు ప్రయాణం మొదలవుతుంది.ఎనిమిదో రోజులు, తొమ్మిదో రోజు పర్యాటకులు తెలుగు రాష్ట్రాలలోని పలు రైల్వే స్టేషన్లలో దిగడంతో టూర్ ముగిసిపోతుంది.
ఐఆర్‌సీటీసీ దివ్యదక్షిణ యాత్ర ప్యాకేజీ మూడు కేటగిరీలు ఇలా ఉన్నాయి.పర్యాటకులు https://www.irctctourism.com/ ఈ వెబ్‌సైట్‌లో ఐఆర్‌సీటీసీ ఇంకా పూర్తి వివరాలు తెలుసుకొని దివ్య దక్షిణ యాత్ర ను బుక్ చేసుకోవచ్చు.
DEVOTIONAL