మకర రాశి వారికీ శత్రువులు ఎక్కువా.. ధనాన్ని పొందాలంటే ఏమి చేయాలి

మకర రాశి వారు జీవితంలో ఎలా ఉంటారు.వారి లక్షణాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

 Characteristics Of Makara Rasi People Details, Makara Raashi, Makara Rashi Peopl-TeluguStop.com

అలాగే మకర రాశి వారు ఏ రత్నాన్ని ధరించాలి.ఏ రెండు దుస్తులను ధరించాలో కూడా వివరంగా తెలుసుకుందాం.మకరం అంటే ముసలి.ముసలి పట్టుకుందంటే ఎంతకు విడిచిపెట్టదని మనకు తెలిసిన విషయమే.అలాగే మకర రాశిలో పుట్టినవారు కూడా ఏదైనా పని చేపట్టారంటే అయ్యే వరకు పట్టు విడవకుండా ప్రయత్నం చేస్తారు.వీరు చేసే ప్రతి పనిలోనూ నేర్పు, ఓర్పు కనపడతాయి.

మకర రాశికి అధిపతి శనీశ్వరుడు. ఈ రాశిలో పుట్టినవారు చాలా కష్టపడతారు.వీరు నిర్మలమైన మనస్సుతో కపటం లేకుండా ఉంటారు.వీరు ముక్కుసూటిగా ఉండటమే కాకుండా నిదానంగా ఉంటారు.

వీరు మనస్సులో ఏమి అనుకుంటే అదే బయటకు చెప్పేస్తూ ఉంటారు.అలాగే మనస్సులో ఒకటి బయటకు ఒకటి మాట్లాడటం వీరికి చేతకాదు.

వీరు ఎప్పుడు నిజాన్నే మాట్లాడతారు.కాబట్టి వీరికి శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు.

వీరు ఖర్చు పెట్టె విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.ఒకరకంగా చెప్పాలంటే పిసినారి అనవచ్చు.

వీరు చాలా శ్రమపడి మంచి పొజిషన్ కి వస్తారు.అందువల్ల చాలా చిన్న వయస్సులోనే కీళ్ల నొప్పుల బారిన పడతారు.

అంతేకాక ఎక్కువ శ్రమ పడటం వలన తొందరగా వృధాప్య ఛాయలు వచ్చేస్తాయి.

Telugu Angry, Astrology, Characteristics, Hard, Makara Raashi, Makararashi, Maka

ప్రతి చిన్న విషయం గురించి కూడా బాగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.వీరికి ఎవరైనా అపకారం తలపెట్టిన లేదా అవమానం చేసిన ఆ విషయాన్నీ చాలా రోజుల వరకు మర్చిపోరు.వీరితో స్నేహితులు, బంధువులు ఏమాత్రం తేడాగా ఉన్న వారికీ దూరం అవ్వటానికి కూడా వెనకడుగు వేయరు.

వీరు సంపాదనకు కన్నా ఆత్మ అభిమానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు.వీరు ఎవరితోనూ మాట పడరు.ఒకవేళ ఎవరైనా మాట అంటే తొందరగా కోపం వచ్చేస్తుంది.

కుటుంబంలోని వారు తనకు గౌరవం ఇవ్వాలని భావిస్తారు.ఒకవేళ ఇవ్వకపోతే గొడవలకు దిగుతారు.

Telugu Angry, Astrology, Characteristics, Hard, Makara Raashi, Makararashi, Maka

మకర రాశిలో పుట్టినవారు ఏదైనా పని చేపట్టినప్పుడు ఏవైనా ఆటంకాలు వస్తే ఇనుప వస్తువును పారే నీటిలో వదలాలి.ఈ రాశివారు శనివారం నాడు అట్లకాడ, పెనం వంటి ఇనప వస్తువులను దానం చేయాలి.ఈ విధంగా దానం చేస్తే ప్రశాంతత కలుగుతుంది.ఈ రాసి వారి ఇంటిలో మంచి సువాసన వచ్చే తెల్లటి పువ్వులను పూసే మొక్కలను పెంచాలి.మకర రాశి వారికీ 5,6,8.వారికీ కలిసి వచ్చే రంగులు నీలం,ఆకుపచ్చ,తెలుపు.

వీరు ఎరుపు రంగు అసలు ధరించకూడదు.నీలం లేదా వజ్రం రాయి ధరించాలి.

ఈ రాళ్లను కేవలం వెండితో మాత్రమే ఉంగరంగా చేయించుకొని పెట్టుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube