వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను రాసుకుంటే పురుషులకు బట్టతల భయం అక్కర్లేదు!

బట్టతల( Bald head ) అంటేనే పురుషులు భయపడిపోతుంటారు.పైగా ప్ర‌స్తుత రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే బట్టతల బారిన పడుతున్నారు.

 If You Use This Oil Twice A Week, You Will Not Get Baldness!, Baldness, Hair Oi-TeluguStop.com

ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, కాలుష్యం, ధూమపానం, మద్యపానం, గంటలు తరబడి లాప్ టాప్స్ ముందు కూర్చుని పని చేయడం, ఒత్తిడి తదితర అంశాలు ఇందుకు కారణాలుగా మారుతున్నాయి.ఏదేమైనా చిన్న వయసులోనే బట్టతల వ‌చ్చింది అంటే ఇక వారి బాధ వర్ణనాతీతం.

అందుకే బట్టతల వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.

అయితే ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ ను వారానికి రెండు సార్లు వాడితే చాలు బట్టతల భయం అక్కర్లేదు.

మ‌రి ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అది అందించే ప్రయోజనాలు ఏంటి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక అలోవెరా ఆకును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక ఉల్లిపాయ( Onion )ను కూడా తీసుకొని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

Telugu Baldness, Care, Care Tips, Oil, Thick-Telugu Health

ఇప్పుడు మిక్సీ జారిలో కట్‌ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కలబంద ముక్కలు( Aloevera ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి అర గ్లాసు కొబ్బరి నూనె, అర గ్లాసు బాదం నూనె వేసుకోవాలి.ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి చిన్న మంటపై కనీసం ప‌ది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.

ఆపై స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్‌ అయిన అనంతరం స్రైన‌ర్‌ సహాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకొని ఒక బాటిల్ లో నింపి స్టోర్ చేసుకోవాలి.

Telugu Baldness, Care, Care Tips, Oil, Thick-Telugu Health

నైట్ నిద్రించడానికి గంట ముందు ఈ ఆయిల్ ను స్కాల్ప్ కు అప్లై చేసుకుని కనీసం ప‌దిహేను నిమిషాల పాటు మర్ధన చేసుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి కేవలం రెండు సార్లు ఈ ఆయిల్ ను వాడితే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.బట్టతల వచ్చే రిస్క్ తగ్గుతుంది.పైగా ఈ ఆయిల్ ను యూజ్ చేయ‌డం వ‌ల్ల‌ చుండ్రు సమస్య దూరం అవుతుంది.తెల్ల జుట్టు( White Hair ) త్వరగా రాకుండా కూడా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube