నల్లటి వలయాలతో వర్రీ వద్దు.. విటమిన్ ఈ ఆయిల్ తో వారం రోజుల్లో వాటికి బై బై చెప్పండి!

నల్లటి వలయాలు( Dark circles ) లేదా డార్క్ సర్కిల్స్.మనలో చాలా మంది కామన్ గా ఫేస్ చేసే సమస్యల్లో ఒకటి.

 How To Get Rid Of Dark Circles With Vitamin E Oil! Vitamin E Oil , Vitamin E Oil-TeluguStop.com

అనారోగ్యమైన జీవనశైలి, అధిక ఒత్తిడి, నిద్రను నిర్లక్ష్యం చేయడం తదితర కారణాల వల్ల కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి.ఈ నల్లటి వలయాలు అందంతో పాటు మనశ్శాంతిని కూడా దూరం చేస్తాయి.

ముఖ్యంగా మగువలు నల్లటి వలయాల కారణంగా చాలా సఫర్ అవుతుంటారు.కానీ ఇకపై వర్రీ వద్దు.

విటమిన్ ఈ ఆయిల్ ( Vitamin E oil )తో చాలా సులభంగా మరియు వేగంగా నల్లటి వలయాలకు బై బై చెప్పవచ్చు.ఇందులో భాగంగానే నల్లటి వలయాలను వదిలించుకునేందుకు విటమిన్ ఈ ఆయిల్ ను ఉపయోగించే ఉత్తమ మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Dark Circles, Latest, Skin Care, Skin Care Tips, Vitamin, Vitamin O

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe vera gel ), వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నైట్ నిద్రించడానికి ముందు కళ్ళ చుట్టూ అప్లై చేసి కనీసం ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.నిత్యం ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే వారం రోజుల్లోనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది.విటమిన్ ఈ ఆయిల్, అలోవెరా.ఈ రెండిటికీ నల్లటి వలయాలను మాయం చేసే సత్తా ఉంది.ఈ రెండిటినీ కలిపి కళ్ళ చుట్టూ అప్లై చేయడం వల్ల క్రమంగా డార్క్ సర్కిల్స్ త‌గ్గు ముఖం పడతాయి.

Telugu Tips, Dark Circles, Latest, Skin Care, Skin Care Tips, Vitamin, Vitamin O

అలాగే మరొక విధంగా కూడా విటమిన్ ఈ ఆయిల్ ను వాడవచ్చు.అందుకోసం ఒక బౌల్ లో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut oil ) వేసుకుని రెండు కలిసేలా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ ఆయిల్ ను కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కళ్ళను క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేసినా కూడా నల్లటి వలయాలు మాయం అవుతాయి.కళ్ళ వద్ద ఏమైనా ముడతలు ఉన్నా సరే తగ్గుముఖం పడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube