హిందూమతంలో గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది.నవగ్రహాలలో సూర్యుడి తనయుడు శనీశ్వరుడి న్యాయ దేవుడు అని పిలుస్తారు.
అదే విధంగా శనీశ్వరుడు శివునికి గొప్ప భక్తుడు.కర్మ ప్రదాత అయిన ఆ శనీశ్వరుడు(Lord Shaniswara ) వ్యక్తి చేసే పనులకు తగిన ఫలితాలను ఇవ్వడమే కాకుండా మంచి పనులను చేసే వ్యక్తిపై తన ఆశీర్వాదాలను ఇస్తాడు.
అలాగే చెడు కర్మలు చేస్తే వారికి తగిన శిక్షలను విధిస్తాడు.అంతేకాకుండా శనీశ్వరుడు సాధారణంగా చేతిలో కత్తి, విల్లుని ధరించి దర్శనమిస్తాడు.
అయితే శనీశ్వరుడు కాకి పై స్వారీ చేస్తూ కనిపిస్తాడు.ముఖ్యంగా చెప్పాలంటే శని దేవుడికి ఒకటి కాదు తొమ్మిది వాహనాలు ఉన్నాయి.ప్రతి వాహనానికి ఒక విశిష్టత ఉంది.పురాణాల ప్రకారం శనీశ్వరుడి వాహనమైన కాకి ఆధ్యాత్మిక జీవులలో ఒకటి.అయితే కాకి ప్రమాదాన్ని సులభంగా పసిగట్టడమే కాకుండా తాను ఎక్కడ నివసించిన ఆ పరిసరాలు అందంగా ఉండేలా చూస్తుంది.అలాగే ఆనందాన్ని ఇస్తుంది.
కాబట్టి శనీశ్వరుడి అనుగ్రహం వలన కాకులు( Crow ) ఎప్పుడూ అనారోగ్యం బారిన పడవని ఒక నమ్మకం.అయితే కాకి శనీశ్వరుని వాహనం ఎలా అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం సూర్యుడి భార్య సంధ్య వేడిని తట్టుకోలేక తన నీడను సృష్టించి ఛాయ అనే పేరుతో సూర్యుడు సేవకు వినియోగించి తపస్సు చేయడానికి వెళ్ళింది.
అయితే సంధ్య తన ఇద్దరు పిల్లలైన యమ, యమునా దేవిని( Yamuna Devi ) ఛాయకు అప్పగించింది.సంధ్య తపస్సు ముగిసే సమయానికి ఛాయా సూర్యుడికి శనీశ్వరుడు జన్మించాడు.ఈ విషయం సంధ్య కు తెలియగానే ఆమె చాలా కోపం వచ్చింది.
సూర్యదేవుడికి అసలు విషయం తెలిసి ఛాయను, శనీశ్వరుడిని విడిచిపెట్టాడు.అప్పుడు సంధ్య సూర్యుడి ప్రవర్తనకు విచారంతో ఛాయా శనీశ్వరుడుతో కలిసి అడవికి వెళ్లిపోయింది.
ఇక ఛాయా, శనీశ్వరుడు అడవిలో నివసిస్తున్నారని తెలుసుకున్న సూర్య భగవానుడు వాళ్ళిద్దరిని చంపాలని అడవికి నిప్పంటించాడు.ఆ తర్వాత చాయ నీడగా మారి మంటల నుండి తప్పించుకుంది.
కానీ శనీశ్వరుడు మంటలు చిక్కుకున్నాడు.అప్పుడు శనీశ్వరునీతో కలిసి అడవిలో నివసిస్తున్న వారు కూడా మరణించారు.
ఈ సమయంలో ఒక కాకి ఆ మంట నుండి శనీశ్వరుడుని బయటకు తీసింది.ఇక అప్పటి నుండి కాకి శనీశ్వరుడికి ఇష్టమైనది గా మారింది.
దీంతో అప్పటి నుంచి కాకిని తన వాహనంగా శనీశ్వరుడు మార్చుకున్నాడు.
LATEST NEWS - TELUGU