సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) సర్కారు వారి పాట తర్వాత మరో సినిమాను స్టార్ట్ చేసి ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.మహేష్ లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ‘‘గుంటూరు కారం”( Guntur Karam ).
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మరి కొద్దీ రోజుల్లోనే రిలీజ్ కాబోతుంది.ఈ క్రమంలోనే షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి చేస్తూ ప్రమోషన్స్ కు సిద్ధం అవుతున్నారు.
ఇంకా చిన్న చిన్న ప్యాచ్ వర్కులతో పాటు స్పెషల్ సాంగ్ షూట్ బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.కాగా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ గురించి ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతుంది.
ఈ స్పెషల్ సాంగ్ కోసం ఇంకా హీరోయిన్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.మరి ఆ బ్యూటీ ఎవరంటే.గడ్డలకొండ గణేష్ సినిమాలో జర్ర జర్ర సాంగ్ తో యూత్ ను తన వైపుకు తిప్పుకున్న బ్యూటీ డింపుల్ హయతి ( Dimple Hayathi) ఈ సాంగ్ లో సూపర్ స్టార్ తో ఆడిపాడబోతుందట.మరి ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అయ్యింది.
త్రివిక్రమ్ మార్క్ లో ఈ సాంగ్ ను ఎలా ప్రెజెంట్ అనిపిస్తుంది.కాగా ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి ( SreeLeela Meenakshi Chaudhary )హీరోయిన్ లుగా నటిస్తుండగా జగపతి బాబు( Jagapathi babu ) విలన్ గా కనిపిస్తున్నాడు.ఇక హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.