దాదాపు అన్ని వయస్కుల వారిని సర్వ సాధారణంగా వేధించే జీర్ణ సమస్యల్లో మలబద్ధకం ముందు వరసలో ఉంటుంది.మలబద్ధకం అనేది చిన్న సమస్యే అయినప్పటికీ.
నిర్లక్ష్యం చేస్తే మాత్రం వ్యర్థాలన్నీ శరీరంలో పేరుకుపోతాయి.దాంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ముఖ్యంగా జీర్ణాశయ వ్యాధులు, హైపర్ టెన్షన్, పైల్స్, ఆకలి మందగించడం, భరించలేని కడుపు నొప్పి ఇలా ఎన్నెన్నో సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.అందుకే మలబద్ధకాన్ని వదిలించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు.
ఇరుగు పొరుగు వారు చెప్పిన చిట్కాలన్నీ ప్రయత్నిస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇకపై నో టెన్షన్.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే మూడు ఆహారాలను డైట్‌లో చేర్చుకుంటే మలబద్ధకం అన్న మాటే అనరు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మూడు ఆహారాలు ఏంటో ఓ చూపు చూసేయండి.
అత్తి పండ్లు. వీటినే పిగ్స్ అని, అంజీర్ పండ్లని పిలుస్తుంటారు.రుచి ఎలా ఉన్నా.
ఆరోగ్యానికి మాత్రం అత్తి పండ్లు అనేక ప్రయోజనాలను అందిస్తాయి.ముఖ్యంగా మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి అత్తి పండ్లు ఓ న్యాచురల్ మెడిసిన్‌లా పని చేస్తాయి.
రోజూ నైట్ నిద్రించే ముందు రెండంటే రెండు అత్తి పండ్లను వాటర్‌లో నానబెట్టుకుని.మరుసటి రోజు ఉదయాన్నే తినాలి.
ఇలా చేస్తే మలబ్ధకం పరార్ అవుతుంది.

నెయ్యి. పాల నుంచి వచ్చే ఉత్పత్తుల్లో ఇది ఒకటి.అయితే పాల కంటే నెయ్యి చాలా రుచిగా ఉంటుంది.
అలాగే ఆరోగ్యానికి ఎన్నో అమోఘమైన పోషకాలను అందిస్తుంది.మలబద్ధకాన్ని నివారించడంలోనూ నెయ్యి సహాయపడుతుంది.
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కలిపి తీసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి చేస్తే మలబద్ధకం అన్న మాటే అనరు.

ఇక సబ్జా గింజలు కూడా మలబద్ధకాన్ని నివారిస్తాయి.రోజుకు హాఫ్ టేబుల్ స్పూన్ సబ్జా గింజలను వాటర్‌లో నానబెట్టి లేదా స్మూతీల ద్వారా తీసుకుంటే.జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.దాంతో మలబద్ధకం సమస్య నుండి విముక్తి లభిస్తుంది.







