ఈ రోజు మహాశివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఘనంగా, వైభవంగా జరుపుకుంటున్నారు.మహాశివరాత్రి కనుక ఈ రోజు రాత్రి 8 గంటల రెండు నిమిషములకు మొదలై, ఆదివారం రోజున సాయంత్రం నాలుగు గంటల 18 నిమిషములకు ముగుస్తుంది.
శివుడికి అంకితమైన ఈ రోజు ఎంతో పవిత్రమైనదిగా భక్తులు భావిస్తూ ఉంటారు.
పురాణాలలో శివరాత్రికి చాలా ప్రత్యేకమైన విశిష్టత ఉంది.
అందుకే శివరాత్రి రోజున దైవ క్షేత్రాలు అన్ని భక్తులతో చాలా రద్దీగా ఉంటాయి.పరమ శివుడిని, పార్వతిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.
ముఖ్యంగా ఈ రోజున శివుడిని పూజించేటప్పుడు బిల్వ పత్రాలు, తేనే, పాలు, పెరుగు, పంచదార, గంగాభిషేకంతో అభిషేకం వంటివి చేస్తూ ఉంటారు.
అయితే ఈ రోజున చేయవలసిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం నిద్ర లేవగానే కచ్చితంగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించడం మంచిది.ఈ రోజున ఉపవాసం ఉంటే ఇంకా మంచిది.ఈ రోజున ఏదైనా శివాలయానికి వెళ్లి శివుడికి నీరు, పాలు ద్వారా అభిషేకం చేయాలి.
మహాశివరాత్రి రోజు ఓం నమశ్శివాయ అని జపించాలి.ఈ రోజున ఉపవాసం తో పాటు రాత్రి జాగరణ ఉంటే శివుడి అనుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే శివరాత్రి రోజు పప్పులు, బియ్యం, గోధుమలతో చేసిన ఆహార పదార్థాలను తినకూడదు.
కొంతమంది వేద పండితులు తెలిపిన దాని ప్రకారం ఈ రోజు నల్ల దుస్తులను ధరించడం అంత మంచిది కాదు.
శివునికి ఈరోజు సమర్పించే నైవేద్యాన్ని అస్సలు ఎంగిలి చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు.ఈరోజున ఉపవాసం ఉన్నవారు నిద్ర పోకపోవడం ఎంతో మంచిది.ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున ఎలాంటి మాంసం, మద్యం వంటివి సేవించకూడదు.
దాదాపు భక్తులందరూ ఈ నిబంధనలను పాటిస్తూ మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు.
LATEST NEWS - TELUGU