బాసర పుణ్యక్షేత్రానికి పోటెత్తిన భక్తులు..

మన తెలంగాణ రాష్ట్రం లోని నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మ వారి దేవాలయానికి ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు.అంతే కాకుండా తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలని రాష్ట్ర నలుమూలల నుంచి ఎక్కువగా తల్లి దండ్రులు వేలాదిగా బాసర పుణ్య క్షేత్రానికి తరలివస్తుంటారు.

 Devotees Rush At Basara Saraswati Ammavaru Temple Details, Devotees Rush ,basara-TeluguStop.com

ఈ రోజు ఆదివారం సెలవు దినం కావడంతో నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మ వారి దేవాలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.అంతే కాకుండా ఇవాళ పుష్యమి నక్షత్రం,మఘ పూర్ణిమ రోజు ఆదివారం కావడంతో తెల్లవారుజామున నుంచి భక్తులు క్యూ లైన్ లో రద్దీగా వేచి ఉన్నారు.

Telugu Basara, Basaragnana, Basarasaraswati, Basara Temple, Bhakti, Devotees Rus

విజ్ఞాన సరస్వతీ అమ్మవారి సన్నిధిలో తమ తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలని మన దేశ నలమూలల నుంచి ఎక్కువగా తల్లిదండ్రులు ఈ పుణ్య క్షేత్రానికి తరలివచ్చారు.అయితే చిన్నారులకు అక్షరాభ్యాసాలు శ్రీకర, కుంకుమ అర్చన పూజలు జరిపిస్తూ ఉన్నారు.ఇంకా చెప్పాలంటే తెల్లవారుజామున నుంచి ప్రజలు గోదావరిలో పుణ్యస్నానాలు చేసి శివాలయంలో ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు.భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల అమ్మ వారి దర్శనానికి చాలా సమయం పడుతుందని భక్తులు చెబుతున్నారు.

Telugu Basara, Basaragnana, Basarasaraswati, Basara Temple, Bhakti, Devotees Rus

భక్తుల రద్దీకి తగినట్లుగా దేవాలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు, టికెట్ కౌంటర్లు ఏర్పాటు కూడా చేశారు.అయితే భక్తుల రద్దీ నేపథ్యంలో దేవాలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా దేవాలయ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం తాగునీరు ఏర్పాట్లను కూడా చేశారు.అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల కోసం అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంచారు.భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో భక్తులు కాస్త ఓపికగా వేచి ఉండి దేవాలయంలోకి రావాలని దేవాలయ అధికారులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube