హైదరాబాద్: అత్యంత మహిమగల అమ్మవారి కల్యాణోత్సవం పెద్ద ఎత్తున జరుపుతున్నట్లు అమ్మవారి కళ్యాణం కు వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా దర్శన భాగ్యం కల్పించడమే తమ కర్తవ్యం అన్నారు మంత్రి తలసాని అన్నారు.అమీర్పేటలోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం కళ్యాణ మహోత్సవం వార్షికోత్సవం ఈనెల 5న జరుగుతున్న సందర్భంగా బుధవారం స్థానిక అమీర్పేట లోని ఎల్లమ్మ దేవాలయం వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం నిర్వహణ, ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈనెల 5వ తారీఖున అంగరంగ వైభవంగా అమ్మవారి కల్యాణోత్సవం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపిన మంత్రి తలసాని.ఐదో తారీఖున అమ్మవారి కళ్యాణం ఆరో తారీఖున పెద్ద ఎత్తున రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ముఖ్యంగా కళ్యాణోత్సవానికి సుదూర ప్రాంతాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారని అలాంటి భక్తుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలను కల్పించడం, భక్తులకు ఎటువంటి ఆటంకాలు రాకుండా అధికారులు సమన్వయంతో దర్శన భాగ్యం కల్పిస్తున్నామని మంత్రి అన్నారు.