Manisha Koirala : కళ్ళతోనే వలపు వల విసిరినా ఆ మనీషా కు ఏమైంది ?

నేపాలి రాజ కుటుంబం అయినా కొయిరాలా అనే ప్రఖ్యాత కుటుంబంలో జన్మించింది మనిషా కొయిరాలా( Manisha Koirala ).53 ఏళ్ల ఈ అందాల సుందరి 1989లో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.ప్రఖ్యాత రెండవ అతిపెద్ద నేపాలీ అవార్డు( Nepali Award ) అందుకున్న ఏకైక నటీమణిగా చరిత్ర సృష్టించింది.ఈమె తాత నేపాల్ దేశానికి 22వ ప్రధానమంత్రిగా పనిచేశారు.అయితే క్యాన్సర్ కారణంగా సినిమా ఇండస్ట్రీ నుంచి మెల్లిమెల్లిగా దూరమైపోయింది ఈ అమ్మడు.2010లో ప్రేమించి నేపాలిలోని బిజినెస్ మాన్ ని పెళ్లాడింది.కానీ ఆమె ఆరోగ్యం కారణంగానే అతడు కూడా ఆమెను వదిలేశారు.2012లో విడాకులు తీసుకుని ప్రస్తుతం మనిషా ఒంటరిగానే ఉంటుంది.

 What Happened To Manisha Koirala-TeluguStop.com

Telugu Cancer, Hollywood, Manisha Koirala, Nepali Award-Telugu Top Posts

అయితే ఇటీవల ఆమెకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.53 ఏళ్ల వయసులో చాలామంది హీరోయిన్స్ అందంగా ఉండటానికి మెరుగులు దిద్దుకుంటున్న నేపథ్యంలో శరీర సౌందర్యం గురించి పూర్తిగా పక్కన పెట్టేసినట్టుగా ఉంది మనిషా.వృద్ధురాలిగా కనిపిస్తున్న మనీషా అసలు గుర్తుపట్టలేని విధంగా ఉండటం ఆమె అభిమానులను కలవడానికి గురిచేస్తుంది.ఎందుకంటే ఆమె గతంలో క్యాన్సర్ వ్యాధితో( cancer ) బాధపడిన విషయం మనకు తెలిసిందే.

మళ్ళీ ఏమైనా ఈ వ్యాధి తిరగబెట్టిన అని అనుమానం అందరిలో వ్యక్తం అవుతుంది.అయితే వ్యాధి సంగతి పక్కన పెడితే ఆమె బాహ్య సౌందర్యానికి విలువ ఇవ్వడం లేదనేది ప్రస్తుతం తెలుస్తున్న విషయం.

Telugu Cancer, Hollywood, Manisha Koirala, Nepali Award-Telugu Top Posts

ఈ వీడియోలో ఆమె కళ్ళద్దాలతో తెల్లటి నెరిసిపోయిన జుట్టుతో కనిపిస్తుంది.కానీ ఆమెలోని అంతర్ సౌందర్యం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.ఆమె మాట్లాడుతున్న కొద్ది ఆమె కళ్ళు హావబావలను పలికిస్తున్నాయి.ఇక మనిషా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ నుంచి పూర్తిగా తప్పుకోలేదు కానీ ఏడాదికి ఒక సినిమాకు మించి నటించడం లేదు.

ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఎక్కువ చేయాలని చాలామంది కోరుకుంటున్నారు.కానీ ప్రస్తుతం అడపాదడపా నటిస్తుంది కానీ పూర్తిగా సినిమాల్లో నటించడానికి ఆమె సిద్ధంగా లేదు.ఏడాది కో చిత్రం కన్నా ఎక్కువగా చేయడం లేదు.2023లో ఒక హాలీవుడ్( Hollywood ) చిత్రంలో కూడా మనిషా కనిపించింది.కానీ ఎందుకో ఆమె పూర్తి నైరాన్యంలో కురుకుపోయినట్టుగా కనిపిస్తుంది.ఇక సౌత్ ఇండియా భాషల్లో భారతీయుడు, క్రిమినల్, ముంబై ఎక్స్ప్రెస్, నగరం వంటి సినిమాలలో ఆమె కనిపించింది .ఈ చిత్రాలన్నీ తెలుగులో డబ్బింగ్ కూడా చేయబడ్డాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube