టీడీపీ యువ నాయకుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్ వ్యూహం ఎన్నికల్లో సెగపుట్టిస్తుందా? ఆయన చేసిన వ్యూహం ఫలిస్తుందా? వైసీపీని నగరాల్లో పాగా వేయకుండా నిలువరిస్తుందా? ఇదీ ఇప్పుడు ఆసక్తిగా మారిన టీడీపీ చర్చ కార్పొరేషన్, మునిసిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నారా లోకేష్ మేనిఫెస్టోను విడుదల చేశారు.అయితే దీనిని వైసీపీ లైట్ తీసుకుంది.
కొందరు వైసీపీ నాయకులు స్థానికానికి కూడా మేనిఫెస్టో విడుదల చేస్తారా? అని చలోక్తులు విసురుతున్నారు.ఇక, ప్రభుత్వ సలహాదారు సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏకంగా ఈ మేనిఫెస్టోను 420గా అభివర్ణించారు.
అయితే టీడీపీలో మాత్రం మేనిఫెస్టోను కీలకంగా భావిస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన కీలక హామీ రూ.5 కే భోజనం పెట్టే అన్న క్యాంటీన్లను తిరిగి తెరుస్తామని.ఇది వైసీపీని నిలువునా టార్గెట్ చేస్తుందని తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు.
ఖచ్చితంగా నగరాలు, పట్టణాల్లో పేదలు ఈ క్యాంటీన్ల కోసం ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం మండుతున్న ధరలతో ఒకపూట తింటే రెండో పూట లేక అల్లాడుతున్న పేదలు ఇలాంటి క్యాంటీన్లు ఉండాలని అనుకుంటున్నారు.

ఇక, పన్నుల తగ్గింపు.అదేవిధంగా నీళ్లకుళాయిలను ఇంటింటికీ ఇవ్వడం.వంటి హామీలు కూడా బాగానే వర్కవుట్ అవుతున్నాయి.ప్రస్తుతం టీడీపీ మేనిఫెస్టోకు సోషల్ మీడియాలో మంచి కామెంట్లు పడుతుండడమే కాదు ఈ హామీలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి.
వైసీపీ సర్కారు ఏప్రిల్ 1 నుంచి నగరాలుపట్టణాల్లో ఇంటి పన్నులు, ఆస్తుల పన్నులు పెంచుతోంది.ఈనేపథ్యంలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.ఇప్పుడు లోకేష్ గురి చూసి ఇక్కడే కొట్టారు.ప్రస్తుతం టీడీపీ మేనిఫెస్టో భారీ ఎత్తున వైరల్ అవుతోంది.
కాబట్టి వైసీపీ నష్టపోవడంఖాయం.ఏదేమైనా ప్రస్తుతం టీడీపీకి మంచి ఫాలోయింగ్ కనిపిస్తోంది నగరాలు, పట్టణాల్లో కార్మికులు ఎక్కువ, కూలీలు ఎక్కువ., వీరంతా కూడా ఇసుక దొరక్క పనులు లేక ఇబ్బంది పడుతున్నారు.అదేసమయంలో రూ.5 భోజనానికి అలవాటు పడింది కూడా వీరే.సో లోకేష్ లక్ష్యం కచ్చితంగా నెరవేరుతుందని అంటున్నారు తమ్ముళ్లు.
మరి ఏం జరుగుతుందో చూడాలి.